NTV Telugu Site icon

CS Shanti Kumari : మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ఆక్వా హబ్‌ ఏర్పాటు

Cs Shanti Kumari

Cs Shanti Kumari

రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ల ఏర్పాటుపై సాధించిన పురోగతిని పరిశ్రమల శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష చేశారు. ఆహార, వ్యవసాయ రంగంలో ప్రతి జిల్లాలో డిమాండ్, సాధ్యాసాధ్యాల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లను ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనమని అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేసారు. దీని ప్రకారం, పెట్టుబడిదారుల నుండి డిమాండ్ ఉన్న ఏడు ప్రదేశాలలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లను ప్రోత్సహించడానికి వ్యూహాన్ని రూపొందించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Also Read : Solar Flare: భూమిని ఢీ కొట్టిన సౌరజ్వాల.. పలు ప్రాంతాల్లో రేడియో సిగ్నల్స్ కు అంతరాయం.. సూర్యుడిపై మార్పులకు కారణం ఇదే..

రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వచ్చే నాలుగైదు నెలల్లోగా రైస్‌మిల్లుల ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌ లో ఆక్వా హబ్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతి కుమారి అధికారులను కోరారు.

Also Read : Killer Plant Fungus: కోల్‌కతా వ్యక్తిలో “కిల్లర్ ప్లాంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్”.. ప్రపంచంలోనే మొదటి కేసు

Show comments