NTV Telugu Site icon

Crocodile In College: ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం

Iit Mum

Iit Mum

Crocodile In College: సోషల్ మీడియాలో రోజుకు అనేక వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతానే ఉంటాయి. ఇందులో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఇకపోతే, సులభంగా పర్యావరణ అనుకూలతలు మార్చుకునే కొన్ని జంతువులు అప్పుడప్పుడు నగరాల్లోనూ ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఈ తరహాలోనే తాజాగా ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఓ భారీ మొసలి సంచరించి విద్యార్థులు, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లైతే..

Read Also: CM Chandrababu: రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం..

మహారాష్ట్రలోని ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఓ భారీ మొసలి కనిపించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. రాత్రి సమయంలో క్యాంపస్‌ లోని రోడ్డుపై ఇది సంచరించింది. స్థానిక సరస్సు నుంచి బయటకు వచ్చిన ఈ మొసలి విద్యార్థులు, అధ్యాపకులు, స్థానికులను భయాందోళనకు గురి చేసింది. కొందరు భయంతో పరుగులు తీయగా.. మరికొందరు దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, జంతు ప్రేమికులు ఘటనాస్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకున్నారు. మొసలికి ఎవరు ఎటువంటి హాని కలిగించకుండా, గాయపరచకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, కొంత సమయం తర్వాత మొసలి స్వయంగా స్థానిక పొవై సరస్సులోకి వెళ్లిపోయిందని జంతు రక్షకులు తెలిపారు.

Read Also: Rishabh Pant: రూ. 27 కోట్లు గంగలో కలిసినట్లేనా..? రిషబ్ పంత్ ప్లాప్ షో!

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఐఐటీ బాంబేకి జీవులు కూడా చుదువుకోవడానికి వెళ్లి ఉంటుందని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరెమో, పొవై సరస్సు దగ్గర ఇలాంటి ఘటనలు మామూలేనని, అలంటి వాటికీ భయపడాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు.