NTV Telugu Site icon

IPL: 9వ స్థానంలో ధోని బ్యాటింగ్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్.. సెటైర్స్ వేస్తున్న క్రికెటర్స్

Dhoni

Dhoni

IPL 2025 లో జరిగిన 8వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిఎస్‌కెను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. 50 పరుగుల తేడాతో సీఎస్కే ఓడిపోవడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. క్రికెటర్స్ సైతం ధోనిపై సెటైర్స్ వేస్తున్నారు. ఆర్సీబీపై మహేంద్ర సింగ్ ధోని వ్యూహంపై క్రికెట్ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తారు. దీని అంతటికి కారణం ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగడమే.

Also Read:Google Pixel 9a: ప్రీమియం ఫీచర్లతో విడుదలకు సిద్దమైన గూగుల్ పిక్సెల్ 9a

మహేంద్ర సింగ్ ధోని గురించి నెట్టింటా చర్చ జరుగుతోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు రావడంపై క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్పీడుగా రన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. స్టేడియం మొత్తం ధోని పేరుతో ప్రతిధ్వనించింది. కానీ, ఆ టైమ్ లో ధోని హాయిగా పెవిలియన్‌లో ఉన్నాడు. ఆలస్యంగా బ్యాటింగ్ కు వచ్చిన ధోని తీరుపై ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఆర్సీబీని గెలిపించిన ధోని అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒంటి చేతితో జట్టును విజయతీరాలకు చేర్చే ధోని జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు దిగకుండా ఆలస్యంగా రావడంపై ఆ వ్యూహం ఏంటో తమకు అర్ధం కావడం లేదని క్రికెటర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Also Read:RS Praveen Kumar : తెలంగాణలో రాక్షస, రాబందులు పాలన నడుస్తుంది

ధోని తొమ్మిదో స్థానంలో వచ్చి 16 బంతుల్లో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కానీ అప్పటికి చాలా ఆలస్యమైంది. ఆ సమయంలో మ్యాచ్ ఉన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ధోని ఇంకా 15 బంతులు ఆడాల్సింది. ఇప్పటికీ అద్భుతమైన బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ధోని ఆర్ అశ్విన్ కంటే ముందే బ్యాటింగ్ కు వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సీఎస్కే ఫ్యాన్స్ అంటున్నారు. సీఎస్ కే ఫ్యాన్ మాట్లాడుతూ ధోనిపై ఉన్న ప్రేమ‌తో చాలా మంది బ్లాక్‌లో టికెట్లు కొని మ్యాచ్ చూసేందుకు వ‌స్తున్నామ‌న్నాడు.

Also Read:Film Journalists: ఫిలిం జర్నలిస్టు సంఘాలతో ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం

గ‌త కొంత‌కాలంగా ధోని 18వ ఓవ‌ర్ త‌రువాత‌నే బ్యాటింగ్‌కు వ‌స్తున్నాడ‌ని.. ఓ 20 బంతులు ఆడి ఓ సిక్స్‌, ఫోర్ కొట్టగానే అంద‌రూ ధోని ధోని అంటూ అత‌డి నామ‌స్మరణ చేస్తున్నార‌ని మండిప‌డ్డాడు. ఇలా ఆడ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని చెప్పుకొచ్చాడు. ఈ సీజ‌న్ త‌రువాత ఆట‌కు ధోని రిటైర్‌మెంట్ ప్రకటిస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ధోనీ, దయచేసి రిటైర్మెంట్ తీసుకోండి.. డబ్బు కోసమే ఆడకండి అంటూ ఓ క్రికెట్ ఫ్యాన్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

Also Read:RS Praveen Kumar : తెలంగాణలో రాక్షస, రాబందులు పాలన నడుస్తుంది

మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి ఎందుకు వెళ్తున్నాడో తనకు అర్థం కావడం లేదని ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్, సీఎస్‌కే ఆటగాడు షేన్ వాట్సన్ అన్నారు. భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని నేను ఎప్పటికీ సమర్థించను, అది జట్టుకు మంచిది కాదు’ అని పఠాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. వీరేంద్ర సెహ్వాగ్ సైతం ధోనిపై సెటైర్స్ వేశాడు. ‘ధోనీ తొందరగానే బ్యాటింగ్​ కు వచ్చాడు. సాధారణంగా తను 19 లేదా 20వ ఓవర్లో బ్యాటింగ్​ కు దిగుతాడు. కానీ ఇవాళ 16వ ఓవర్లోనే క్రీజులోకి వచ్చాడు. అంటే తొందరగా వచ్చినట్లే కదా అని సెటైర్లే వేశాడు.