NTV Telugu Site icon

Sourav Ganguly: వైస్ కెప్టెన్ గా నియమించడంపై విమర్శలు.. అతడైతేనే బెస్ట్..!

Ganguly

Ganguly

Sourav Ganguly: వెస్టిండీస్ పర్యటనకు భారత టెస్ట్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జట్టు ప్రకటనపై పలువురు మాజీ క్రికెటర్లు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా టీమిండియా వైస్ కెప్టెన్ నియామకంపై కొందరు భగ్గుమంటున్నారు. వెస్టిండీస్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానే పేరును బీసీసీఐ ఖరారు చేసింది. అయితే ఈ నిర్ణయంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా తనదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

Read Also: PhonePe: సీఎంపై కాంగ్రెస్ పోస్టర్లు.. లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న ఫోన్ పే

అజింక్యా రహానేను వైస్ కెప్టెన్‌గా చేయడం తనకు ఒకింత ఆశ్చర్యం కలిగించిందని సౌరవ్ గంగూలీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచన ఏమిటో అతనికి అర్థం కాలేదన్నారు. అతని అభిప్రాయం ప్రకారం టీమ్ ఇండియాకు శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా చేసి ఉండాల్సిందన్నారు. వైస్ కెప్టెన్ బాధ్యతలను శుభ్‌మాన్ గిల్‌కు అప్పగిస్తే.. టీమ్ ను ఆదర్శవంతగా తీర్చిదిద్దుతాడని అభిప్రాయపడ్డాడు. అయితే రహానెను వైస్ కెప్టెన్‌గా చేయాలనే నిర్ణయాన్ని బ్యాక్‌ఫుట్‌లో ఉంచడాన్ని తాను భావించడం లేదని.., వైస్ కెప్టెన్ గా నియమించడంపై తనకు ఏమీ అర్థం కావడం లేదని గంగూలీ అన్నాడు.

Read Also: Delhi Murder Case: ఢిల్లీ హత్య కేసు నిందితుడికి మరణశిక్ష విధించాలి… ఢిల్లీ పోలీసులు

అంతేకాకుండా శుభమాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా చేయకున్నా.. కనీసం రవీంద్ర జడేజాకు బాధ్యతను అప్పగించవచ్చు గంగూలీ అన్నాడు. అతను మంచి అభ్యర్థి మరియు అంతేకాకుండా చాలా కాలం పాటు టెస్టుల్లో ఆడుతున్నాడని తెలిపాడు. అజింక్య రహానే 18 నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్నారు. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఒక మ్యాచ్ ఆడాడని.. ఆ తర్వాత వైస్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రహానే అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది.