NTV Telugu Site icon

Cristiano Ronaldo: మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసిన రొనాల్డో.. (వీడియో)

Ronaldo

Ronaldo

Cristiano Ronaldo: లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఏం చేసినా అది సెన్సేషనల్‌గా మారుతుంది. ఇటీవల, క్రిస్టియానో రొనాల్డో చేసిన ఒక పనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. క్రిస్మస్ సెలవులను తన కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి, రొనాల్డో ఫిన్‌లాండ్‌లోని లాప్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. రొనాల్డో చలిగా ఉన్న ప్రాంతంలో తిరుగుతూ మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసాడు రొనాల్డో. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read: Pushpa -2 Collections : రూ. 100 కోట్లైతే బాహుబలి ఔట్.. రూ. 200 కోట్లైతే హిస్టరీ.!

ఇందులో రొనాల్డో స్వయంగా ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉందని వీడియోలో పేర్కొన్నాడు. తరువాత, అతను స్విమ్మింగ్ పూల్‌లో నెమ్మదిగా మెట్ల ద్వారా దిగడం మొదలుపెట్టాడు. చల్లగా ఉండే నీటిలో దిగడం కొంచెం కష్టంగా ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అతను పూల్‌లోకి దిగిన తరువాత, అతని వెనుక ఉన్న వ్యక్తి పూల్ లోతు 2 మీటర్లు ఉందని చెప్పాడు. ఆ తర్వాత, రొనాల్డో తన మెడ వరకు నీటిలోకి దిగిన తరువాత, ఈ నీరు కొంచెం చల్లగా ఉంది. కానీ, చాలా బాగుందని ఉత్సాహంగా అన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత, అతను నీటి నుంచి బయటకు వచ్చి వీడియోను ముగించాడు.

Also Read: Traffic Challan Discount: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు రాయితీపై పోలీసులు క్లారిటీ..

గత కొన్నేళ్లుగా, సోషల్ మీడియాలో చల్ల నీటి స్నానాలు ట్రెండ్‌గా మారాయి. ఈ మంచు నీటిలో స్నానం చేయడం వల్ల ఊబకాయం, డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. రొనాల్డో చేసిన ఈ స్నానం వీడియోకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇకపోతే, రొనాల్డోకి సంబంధించిన ఫిట్‌నెస్ విషయాలు మనందరికీ తెలిసిందే. అతని ఫిట్నెస్ తో ఆటలో అద్భుతమైన ప్రదర్శన చూపిస్తున్నాడు.

Show comments