Site icon NTV Telugu

Telangana Govt-CRISP: ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న క్రిస్ప్!

Seethakka

Seethakka

సెక్రటేరియట్‌లో మంత్రి సీతక్కతో క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్.సుబ్రమణ్యం భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారతల బలోపేతంపై చర్చ జరిగింది. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు క్రిస్ప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. క్రిస్ప్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో క్రిస్ప్ మెంబర్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సీఆర్డీ డైరెక్టర్ సృజనలు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

దేశంలోని 14 రాష్ట్ర ప్రభుత్వాలతో క్రిస్ప్ కలిసి పనిచేస్తోంది. ఆయా రాష్ట్రాలకు క్రిస్ప్ ఉచితంగా సేవలందిస్తోంది. గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా మార్చే ప్రణాళికలు, స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణలు తెచ్చే దిశలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మంత్రి సీతక్క కోరారు. స్థానిక ఎన్నికలు పూర్తయి కొత్త పాలకమండలి ఏర్పడే నాటికి యాక్షన్ ప్లాన్ ఖరారు చేయాలని సూచించారు.

Exit mobile version