NTV Telugu Site icon

Criminal Arrest: పోలీసుల ప్లాన్ మాములుగా లేదు కదా.. చిక్కిన పదేళ్ల నేరస్థుడు

Criminal

Criminal

ఒక దశాబ్దం పాటు అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న ఓ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వేసిన హనీ ట్రాప్‌లో పడ్డాడు. ఒక మేల్ కానిస్టేబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మహిళగా నేరస్థుడికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో నేరస్థుడు చిక్కినట్లు పోలీసులు గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో దొంగతనం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం.. బూట్‌లెగ్గింగ్ వంటి 20 కేసులు నిందితుడు బంటి (45)పై ఉన్నాయి. అయితే అతన్ని ఆకర్షించడానికి ఓ కానిస్టేబుల్ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను సృష్టించాడు.

SSMB29 : మహేష్, రాజమౌళి మూవీ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్..

నిందితుడిపై 2013లోనే సిటీ కోర్టు ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) మనోజ్ కుమార్ మీనా తెలిపారు. అయితే.. పోలీసులు అతన్ని పట్టుకోవడం కోసం ఎంత ప్రయత్నించినా చిక్కలేదు. కాగా.. నేరస్థుడు బంటి ఇందిరా వికాస్ కాలనీలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే.. నేరస్థుడు ఇన్‌స్టాగ్రామ్ ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఓంపర్కాష్ డాగర్ ఒక వినూత్న ఆలోచనతో వచ్చాడని డిసిపి చెప్పారు.

AP Crime: లవ్‌ ఫెయిల్.. ప్రియురాలి హత్యకు యత్నం.. ప్రియుడి ఆత్మహత్య..

కానిస్టేబుల్ ఒక మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను సృష్టించాడని డీసీపీ తెలిపారు. “కానిస్టేబులో బంటితో చాట్ చేయడం ప్రారంభించాడు.. నేరస్తుడు కూడా ఇన్ స్టాలో బాగానే పరిచయమయ్యాడు” అని డిసిపి చెప్పారు. ఆ తర్వాత.. పంజాబీ బాగ్ మెట్రో స్టేషన్‌లో ‘ఫేక్ మహిళ’ని కలవడానికి బంటి అంగీకరించాడు. జూన్ 7వ తేదీన వారిద్దరూ కలిసేందుకు సిద్ధమవ్వగా.. అక్కడే చాటుగా ఉన్న పోలీసులు పక్కా ప్లాన్ తో నేరస్తుడిని పట్టుకున్నారు. నేరస్థుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తన చిరునామా, ఫోన్ నంబర్లను క్రమం తప్పకుండా మార్చేవాడని డీసీపీ తెలిపారు.