NTV Telugu Site icon

Delhi: పోలీసు అరెస్టును తప్పించుకోవడానికి ఫ్లైఓవర్ నుంచి దూకి నేరస్థుడు మృతి..

Inter Students Suicide

Inter Students Suicide

పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఒక నేరస్థుడు తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. తనను పోలీసులు పట్టుకుంటారని తెలుసుకుని.. ఓ నేరస్థుడు ఢిల్లీలోని యమునా క్రాసింగ్ ఏరియాలోని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకేశాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు వెళ్లారు. మృతుడు జాకీర్ అలియాస్ సోనుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై 10 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

Read Also: Damodar Raja Narasimha: చవకబారు విమర్శలు మానుకోండి.. దామోదర రాజనర్సింహ ట్విట్

ఢిల్లీ తూర్పు ప్రాంతంలో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ ఇర్ఫాన్ అలియాస్ చేను నడుపుతున్న ముఠాలో అతడు సభ్యుడిగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు నిందితులు అఫ్సర్, నదీమ్, అబిద్, షోయబ్‌లతో కలిసి గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కారులో ప్రయాణిస్తుండగా షాహదారా ఫ్లైఓవర్ వద్ద సోనూ పట్టుబడ్డాడు.

Read Also: CM Chandrababu: శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష.. టీటీడీ ఈవోకు కీలక ఆదేశాలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసు బృందం అతనిని పట్టుకునేందుకు చూస్తోంది. ఈ క్రమంలో.. జాకీర్ తప్పించుకోవడానికి ప్రయత్నించి ఫ్లైఓవర్ నుండి దూకాడు. దూకుతున్న సమయంలో చెట్టు కొమ్మను పట్టుకునేందుకు ప్రయత్నించగా చేయి జారి రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే అతన్ని జిటిబి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. మరోవైపు.. నలుగురు నిందితుల నుంచి ఒక ఆస్ట్రియన్ మేడ్ రివాల్వర్, ఏడు రౌండ్ల లైవ్ కాట్రిడ్జ్‌లు, 30 బోర్ పిస్టల్స్, మూడు కంట్రీ మేడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించామని.. తదుపరి విచారణ జరుపుతున్నారని పోలీసులు తెలిపారు.