NTV Telugu Site icon

CMR Rice: 24 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం మాయం.. మూడు రైస్‌ మిల్లుల యజమానులపై క్రిమినల్‌ కేసులు

Cmr Rice

Cmr Rice

మహబూబాబాద్ జిల్లా లోని పలు రైస్ మిల్లుల పై రాష్ట్ర సివిల్ సప్లైస్, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 24 కోట్ల 55 లక్షల 33 వేల రూపాయల సి.ఎం.ఆర్ ధాన్యం ను  మాయం చేసిన 3 రు రైస్ మిల్లుల యజమానుల పై  క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఓ.ఎస్.డి ప్రభాకర్ మాట్లాడుతూ, ఖరీఫ్ , రబీ లో ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను కస్టం మిల్లింగ్ రైస్ (సీఎం ఆర్) జిల్లా లోని పలు  మిల్లులకు కేటాయించగా, బియ్యం ను  అప్పజెప్పని మిల్లుల పై ఈ దాడులు నిర్వహిస్తున్నామని, ఈ దాడుల్లో విస్తుబోయే నిజాలు భయటపడుతున్నాయని, రైస్ మిల్లుల్లో సరిపోయే వరి ధాన్యం నిలువలు ఉండటం లేదని, ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లుల యజమానులపై రెవిన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవడమే గాకుండా వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాన్నామని తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ దాడులు నిరంతరం కొనసాగిస్తామన్నారు. మహబూబాబాద్ పట్టణం లోని శ్రీనివాస ఇండస్ట్రీస్ రా, పారా బాయిల్డ్ రైస్ మిల్లులో  దాడులు కొనసాగిస్తున్నామని , ఇప్పటి వరకు 20 వేల క్వింటాళ్ల ధాన్యం గుర్తించామని , ఇంకా లెక్కింపు జరుగుతుందని లెక్కింపు పూర్తి అయినా తర్వాత పూర్తి వివరాలు వెల్లడి స్తామన్నారు.

PM Modi: రూ.130 కోట్లతో తయారు చేసిన సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన మోడీ..