తెలంగాణ రాష్ట్రంలో నేరాలు సంఖ్య కొంత మేరకు పెరిగినప్పటికి శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యన్నత సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించి నేరాలను అదుపు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే తరహా విధానాలు అమలు చేస్తున్నామని, రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లలో ఆన్ లైన్ సేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో నేరాల కట్టడికి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని నేరాలు పెరిగాయి. దోపిడీలు, దొంగతనాలు, చిన్నారుల కిడ్నాప్ లు, ఈవ్ టీజింగ్ పెరగంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే నేరాలు పెరిగినా అనేక కేసులను చేధించి నేరస్తులకు శిక్షపడేలా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన నేరాలు….2021 2022 పెరిగిన శాతం
దోపిడీ 464 495 7%
దొంగతనాలు 4381 442 11%
సాదారణ దొంగతనాలు 18277 19136 5%
చిన్నారు కిడ్నాప్ లు 2126 2551 15%
చీటింగ్ కేసులు 15741 22005 35%
ఈవ్ టీజింగ్ 7016 7572
తెలంగాణ లో హత్యలు, అత్యాచారాలు, ఆస్థితగాదాల్లో హత్యలను తగ్గాయని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. హత్యలు, అత్యాచారాల్లో అనేక కేసుల్లో తెలిసిన వారితోనే కేసులు నమోదయ్యాయని మహేందర్ రెడ్డి తెలిపారు. అనేక కేసుల్లో యువతులను నమ్మించి అత్యాచారం చేసిన వారిలోఅత్యధికం పరిచస్తులు, కుటుంబ సభ్యులు, ప్రేమికులు ఉన్నారని, వెంటనే వారిని అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తగ్గిన నేరాలు…. 2021 2022 తగ్గిన శాతం
ఆస్థి కొసం హత్యలు 93 45 52%
డెకాయిట్ 46 30 35
హత్యలు 871 762 12.5
అత్యాచారాలు 2577 2126 17
కిడ్నాప్ కేసులు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం 1663
చిన్నారుల అదృశ్ష్యం 724
డబ్బుల కోసం కిడ్నాప్ లు 22
ప్రతీకారం, పాత కక్షలు 08
అత్యాచారం కేసులు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం 1548
స్నేహితులు, కో-వర్కర్స్ 332
బంధువులు 237
గుర్తుతెలియని వ్యక్తులు 09
పెరగుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఆన్ లైన్ కేసులు పెరిగాయని , మోబైల్, ఈ మోయిల్ , పోన్ కాల్స్, ఓటిపిల ద్వారా అమాయకులను మోసం చేయడంతో సైబర్ క్రైమ్ కేసులు సంఖ్య 57శాతం పెరిగింది. భవిష్యత్ లో ఈ తరహా కేసులు పెరుగనున్న నేపద్యంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో సైబర్ సేప్టీ బ్యూరో ఏర్పాటు చేసి సైబర్ నేరాలను కట్టడి చేస్తామన్నారు. ఈ విభాగంలో వెయ్యి మంది టెక్నికల్ సిబ్బందిని నియమించినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల పోలీసుల వాహనాలను జియో ట్యాంగింగ్ ద్వారా పర్యవేక్షణ జరగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత పోలీసుల ఆయుదాలపై పూర్తి స్థాయి లెక్కింపు జరిగిందని ఆయుదాలను వాటినన్నింటిని ఆన్ చేసి వేపన్ మేనేజిమెంట్ ద్వారా పర్యవేక్షణ జరుగుతందని మహేందర్ రెడ్డి తెలిపారు.
సైబర్ నేరాలు 2021 2022
ఆన్ లైన్ మోసాలు 1191 1158
ఈ మెయిల్, వెబ్ సైట్ 75 141
క్లోనింగ్ 716 1663
రోడ్డు ప్రమాదాలు….
ప్రమాదాలు 19248 19456
మరణాలు 6690 6746
గాయపడ్డవారు 18316 18413
తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులను వెట్టిచాకిరి చేయిస్తున్న వారిపై దాడులు నిర్వహించేందుకు ఆపరేషన్ ముస్కాన్ , ఆపరేషన్ స్మైల్ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 6228 మంది చిన్నారులను కాపాడి వారి తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు తెలిరు. ఈ ఏడాదిలో నాలుగు లక్షల మంది పాస్ పోర్టుల వెరిపికేషన్ ఆన్ లైన్ విధానంలో పూర్తిచేశామని, ఈ విధానం దేశంలోనే మోదటిసారి కావడంలో అవార్టులు వచ్చాయి.
హత్యానేరాల్లో 72 కేసుల్లో 96 నిందితులకు ముద్దాయిలకు జీవిత ఖైదు శిక్షలు పడేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వరుస నేరాలకు పాల్పడుతున్న 205 మంది నేరస్తులపై పిడి యాక్ట్ నమోదు చేశారు. సైబర్ నేరాలకు దీటుగా డ్రగ్స్ కేసులు పెరిగాయి…. ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ కింద 1176 కేసులు నమోదుకాగా అందులో 72 డ్రగ్స్ కేసులు 1104 గంజాయి కేసులు నమోదు చేసి 31వేల గంజాయిని సీజ్ చేశారు.మహిళపై నేరాలు అరికట్టేందుకు ఏర్పాటు చేసిన షీటీంలకు ఈ ఏడాదిలో 6157పిర్యాదులు అందగా అందులో 2128 కేసులు నమోదు చేశామన్నారు. 864 పెట్టి కేసులు నమోదు చేసి 1323 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.
మహిళా భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 బరోసా సెంటర్లు ఏర్పాటు చేశామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సంచలనం సృష్టించిన కేసుల్లో సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని, సిసి కెమెరాల ద్వారానే 18234 కేసులు చేధించగలిగామన్నారు. పింగర్ ప్రింట్ ల ద్వారా 420 కేసులు చేధించగా… అందులో 42 గుర్తితెలియని మృతదేమాలను కేవలం వేలిముద్రల ఆధారంగా గుర్తించడం చాలా కీలకమైన విషయం అన్నారు. దేశ వ్యాప్తంగా దిశ ఎన్ కౌంటర్ కేసుపై కమిషన్ విచారణపూర్తి చేసి రిపోర్టును హైకోర్టుకు సమర్పించిదని, ఆ రిపోర్టులో ఎన్ కౌంటర్ లో పాల్గోన్న పోలీసులపై హత్యా నేరం కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు పరిధిలో కేసు ఉండడంతో తరుపరి ఉత్తర్వుల తరువాత పోలీసులపై కేసులు చేస్తామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు.