Crime News: ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో మృతదేహలకు సంబంధించి కేసులు ఎక్కువతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో మృతదేహం రోడ్డుపై ప్రత్యక్షమైంది. శంషాబాద్ నుండి ఆరంఘర్ వైపు వెళ్లే దారిలో సర్వీస్ రోడ్డుపై మృతదేహం కనిపించడం స్థానికుల్లో కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అక్కడ పడి ఉండటాన్ని చూసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
USA క్రికెట్ బోర్డు సభ్యత్వం సస్పెండ్.. ICC కీలక నిర్ణయం
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తిని హత్య చేసి రహదారి పక్కన పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉండగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది.
Crime News: సినిమా స్టోరీకి మించిన కథ.. దోపిడీ ముసుగులో భార్యను కిరాతకంగా చంపించిన భర్త!
