Hair Salon Owner was brutally murdered in Kukatpally: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ సెలూన్ యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు హత్య చేసి సెలూన్‌లోనే శవాన్ని పడేసి వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సెలూన్ తెరిచి చూడగా శవమై కనిపించాడు. సెలూన్ యజమాని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం… ‘హర్ష లుక్స్’ సెలూన్ యజమాని అశోక్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపారాయుడు నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం గుర్తుతెలియని దుండగులు సెలూన్ లోపలి వచ్చి అశోక్‌ను హత్య చేశారు. ఆపై సెలూన్‌లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి.. షట్టర్ మూసేసి పరారయ్యారు. అశోక్ ఇంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి మొబైల్‌కు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. సెల్‌ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి సెలూన్ దగ్గరికి వచ్చిన కుటుంబ సభ్యులు షట్టర్ పైకి లేపడంతో అశోక్ చనిపోయి ఉన్నాడు. అశోక్ భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కూకట్‌పల్లి పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.