Crime News: ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ జిల్లాలోని మైనాథేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం దారుణమైన సంఘటన వెలుగుచూసింది. శనివారం సాయంత్రం పశువుల కోసం పశుపోషణ నిమిత్తం మేత తీసుకురావడానికి ఇంటి నుండి బయటకు వెళ్లిన సైరా అనే యువతి ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే ఆ తర్వాత మరుసటి రోజు పొలాల్లో ఆమె రక్తంతో ఉన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహంపై బలమైన దాడుల చిహ్నాలు కనిపించాయి.
Read Also: Women’s World Cup 2025: మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్, వేదికలు ఖరారు.. నవంబర్ 2న ఫైనల్..!
అయితే పోలీసుల ప్రాథమిక అనుమానం అత్యాచారానికి గురై హత్య చెయ్యబడినట్లుగా అనుకున్నారు. కానీ, మృతదేహంపై నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం జరగలేదని స్పష్టమైంది. హత్య సమయంలో శరీరంలో పదునైన ఆయుధంతో దాదాపు 18 సార్లు పొడవబడినట్లు ధృవీకరించబడింది. దీనితో పోలీసులు వివిధ కోణాలలో నిందుతుడి కోసం వెతక సాగారు. ఇంతలో సైరా మొబైల్ ఫోన్ డేటాలో పోలీసులు విచారణ జరిపినపుడు ఐదు మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఆ నంబర్‌ను ట్రేస్ చేయగా అదే గ్రామానికి చెందిన రఫీ అనే యువకుడి నంబర్‌గా గుర్తించారు.
Read Also: IPL 2025 Final: కొత్త ఛాంపియన్ ఎవరు..? ట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్స్.. ఫొటోస్ వైరల్
సైరా తల్లి సఫినా ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, రఫీ గత కొంతకాలంగా సైరాను వేధిస్తున్నాడు. దీంతో పోలీసులు రఫీని అదుపులోకి తీసుకుని విచారించగా అతను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఇక హంతకుడు రఫీ చెప్పిన వివరణలో తాను సైరాను ప్రేమించానని, కానీ ఆమె తన ప్రేమను తిరస్కరించిందని తెలిపాడు. కొన్ని రోజుల క్రితం గ్రామంలో ఓ వ్యక్తి తనను కొట్టాడని, సైరానే ఆ వ్యక్తిని ప్రేరేపించిందని అనుకున్నట్లు వెల్లడించాడు. దానితో ఆమెను పొలాల వద్ద అడ్డగించి, స్క్రూ డ్రైవర్‌తో దాడి చేసినట్లు తెలిపాడు. సైరా ప్రాణాలను వేడుకున్నప్పటికీ, ఆమె ప్రైవేట్ పార్ట్‌లో స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడు. ఇక ఆమె మరణించినట్లు నిర్ధారించుకుని ఇంటికి వెళ్లి స్నానం చేసి, దుస్తులు మార్చుకుని నిద్రపోయినట్లు పోలీసులు తెలిపారు.
