Site icon NTV Telugu

Crime News: బీదర్‌లో హైదరాబాద్ బిల్డర్‌ దారుణ హత్య..

Murder

Murder

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హైదరాబాద్ చెందిన బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ హత్యకు పోలీసుల కథనం ప్రకారం.. వృత్తి రీత్యా బిల్డరైన జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48)ని రాయితో తలపై కొట్టి, ఆపై కత్తులతో పొడిచి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కర్ణాటకలోని మన్నెకెల్లి పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హత్యకు గురైన మధుకు భార్య వెంకట లక్ష్మి, కుమార్తెలు అలేఖ్య, అఖిల ఉన్నారు. ఓ అధికారిక పర్యటనలో., అతను రేణుకా ప్రసాద్, వరుణ్, లిఖిత్ సిద్ధార్థ రెడ్డితో కలిసి మే 24న చింతల్ నుండి బీదర్‌ కు వెళ్లాడు.

Rashmika: నీయబ్బ, ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది!

మే 24వ తేదీ రాత్రి 10 గంటలకు భార్య ఫోన్ చేయగా.. తాను హైదరాబాద్‌ కు తిరిగి వస్తున్నానని, అయితే ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్‌ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మే 25వ తేదీ ఉదయం, మన్నెకెల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన కారు పక్కన అతని మృతదేహం కనిపించడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అధికారులు. చనిపోయే ముందు తలపై పొడిచి కత్తి వంటి పదునైన ఆయుధంతో పలుమార్లు కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇక మధు మృతదేహం వద్ద రూ. 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, భారీ మొత్తంలో నగదు మాయమైనట్లు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

New Rules 2024: అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు.. పెట్రోల్, ఎల్ పీజీ ధరల్లో మార్పులు

పరారీలో ఉన్నవారు మధును హత్య చేసి బంగారం, నగదు దోచుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బిల్డర్‌ ను హత్య చేసేందుకు ముగ్గురూ పథకం పన్నారని అనుమానిస్తూ.. ప్రసాద్, వరుణ్, లిఖిత్ లను పోలీసులు బీదర్‌ కు మధుతో కలిసి వెళ్లడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version