తమిళ హీరో సూర్య నటించిన ‘సింగం’లోని సన్నివేశాలను సిరిసిల్ల పోలీసులు రీక్రియేట్ చేశారు. పెద్దూర్ గ్రామానికి చెందిన బాధితురాలి తల్లి చేసిన ఒక్క ఫిర్యాదుతో అతిపెద్ద అంతర్జాతీయ సైబర్ ముఠా సమాచారం తెలిసింది. కాంబోడియాలో చైనా కంపెనీలు నిర్వహిస్తున్న సైబర్ మోసాల గుట్టును సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. కొండోబియాలోని భారత రాయబార కార్యాలయం స్థానిక పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించింది.
Also read: AP Weather: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
అయితే సిరిసిల్ల జిల్లా పెదూరు గ్రామానికి చెందిన అతికం లక్ష్మి అనే మహిళ నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. జగిత్యాల జిల్లా కొడిమియాలకు చెందిన కంచర్ల సాయిప్రసాద్ అనే ఏజెంట్ కు రూ.4లక్షలు చెల్లించి తన కుమారుడు శివప్రసాద్ కంబోడియాకు వెళ్లిపోయాడని వివరించారు. కానీ.. అక్కడికి వెళ్లిన తర్వాత అతడి పాస్‌పోర్టును తీసుకెళ్లి భారత్ కు తిరిగి రాకుండా అడ్డుకున్నారు. దింతో ఎస్పీ అఖిల్ మహాజన్ శివప్రసాద్ మొబైల్ నంబర్ తీసుకుని వాట్సాప్ లో మాట్లాడారు. శివప్రసాద్ వంటి భారతీయ బాధితులు 500 నుండి 600 మంది ఉన్నారని, వారి పాస్‌పోర్ట్ లను కూడా వారు తీసేసుకున్నారని అతడు తెలిపాడు. అక్కడ ఓ చైనా కంపెనీలలో సైబర్ క్రైమ్ లకు పాల్పడేందుకు వారంతా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని ఇండియన్ ఫోన్ నంబర్ తో స్కామ్‌లు, లాటరీ స్కామ్ లు, జాబ్ స్కామ్ లు ఇంకా అనేక సైబర్ స్కామ్ లను నడుపుతున్నట్లు వివరించాడు. దాంతో అక్కడ వారు ఒక పనిని పూర్తి చేసి చాలా డబ్బు పొందుతున్నట్లు తెలిపాడు.
Also read: Qutub Minar: త్రివర్ణంలో మెరిసిన కుతుబ్ మినార్.. ఎన్నికల వేళ అవగాహనలో భాగంగా.. వీడియో వైరల్..
దింతో వెంటనే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, కంబోడియాలోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులతో మాట్లాడి బాధితురాలి వివరాలను తెలియజేసినట్లు తెలిపారు. దీంతో అక్కడ ఇరుక్కుపోయిన శివప్రసాద్ ను కాపాడారు. రెండు రోజుల్లో శివప్రసాద్ భారత్ చేరుకుంటారని పోలీస్ అధికారులు తెలిపారు. బాధితులను స్థానికంగానే రక్షించి భారత్‌కు తీసుకువస్తామని కూడా అధికారులు ప్రకటించారు.