Site icon NTV Telugu

Mohammed Siraj: డీఎస్పీగా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరణ..

Siraj

Siraj

డీఎస్పీ (DSP)గా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత.. సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. సిరాజ్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా.. మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

Read Also: Balakrishna: నాకు, నా భార్యకు చిచ్చు పెట్టాలని చూస్తున్నారా!.. బాలకృష్ణ ఫన్నీ కామెంట్స్

టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.. హైదరాబాద్కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా ప్రపంచకప్లో టీమిండియా సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. సిరాజ్‌కు క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 600చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ క్రమంలో.. మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు.. ఈ రెండు హామీలను ప్రభుత్వం నెరవేర్చింది.

Read Also: Andhra Pradesh: ఏపీకి కేంద్రం శుభవార్త.. గోదావరి పుష్కరాలకు భారీగా నిధులు

Exit mobile version