NTV Telugu Site icon

Hanuma Vihari: హనుమ విహారికి లోకేష్ మద్దతు.. తిరిగి ఏసీఏ తరపున ఆడాలని నిర్ణయం

Vihari

Vihari

మంత్రి నారా లోకేష్ను క్రికెటర్ హనుమ విహారి కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో.. తిరిగి ఏసీఏ తరపునే ఆడాలని హనుమ విహారి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా క్రికెటర్ హనుమ విహారి మాట్లాడుతూ.. తన టాలెంటును గత ప్రభుత్వం తొక్కేసిందని ఆరోపించారు. తానుంటే వాళ్లకి ఇబ్బందని నాటి ఏసీఏ భావించిందని తెలిపారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చూపి.. తనతో రాజీనామా చేయించారని విహారి చెప్పారు. చెప్పిన వారిని టీంలో పెట్టుకోలేదని నాటి ఏసీఏ పెద్దలు తనపై కుట్ర పన్నారని పేర్కొన్నారు.

Speaker Election: ఇండియా కూటమి స్పీకర్ ప్రతిపాదనపై తృణమూల్ అసంతృప్తి..

ఓ వైసీపీ కార్పోరేటర్ పేరు చెప్పి తనతో బలవంతంగా రిజైన్ చేయించారని హనుమ విహారి ఆరోపించారు. ఈ క్రమంలో.. చంద్రబాబు, లోకేష్ పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఏపీకి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు తనను ఇబ్బందులకు గురి చేశారన్నారు. అప్పటి ఏసీఏ వ్యవహరించిన తీరుతో వేరే రాష్ట్రం నుంచి ఆడాలని భావించానని.. ఏసీఏ నుంచి ఎన్వోసీ తీసుకుని వేరే రాష్ట్రం తరపున ఆడేందుకు ప్రయత్నించానని చెప్పారు. మరోవైపు.. ఆంధ్రాలో క్రికెట్ను ఎంకరేజ్ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని విహారి తెలిపారు. అంతేకాకుండా.. ఏసీఏ తరపునే ఆడాలని నారా లోకేష్ సూచించారన్నారు. క్రీడల్లో రాజకీయాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని.. లోకేష్ హామీతో తిరిగి ఏసీఏ తరపునే ఆడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెటర్ హనుమ విహారి పేర్కొన్నారు.

MP Gopinath : పార్లమెంటులో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ..

మరోవైపు.. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, ఈరోజు తనను క్రికెటర్ హనుమ విహారి కలిశారన్నారు. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేధింపుల కారణంగా ఆంధ్రా క్రికెట్ ను వదిలి వెళ్లే పరిస్థితులు సృష్టించడం సిగ్గుచేటని తెలిపారు. ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న హనుమ విహారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో తిరిగి స్వాగతం పలుకుతున్నదని ప్రకటించారు. హనుమ విహారికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని లోకేశ్ తెలిపారు.