Ambati Rayudu: క్రికెట్ అంబటి రాయుడు.. ఏపీ సీఎం వైఎస్ జగ్మోహన్‌రెడ్డిని కలిశారు.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌తో కలిసి వచ్చారు క్రికెటర్ అంబటి రాయుడు.. సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అంబటి రాయుడితో పాటు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ కూడా ఉన్నారు.. ఈ సందర్భంగా ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎం జగన్‌కు చూపించారు.. దీంతో, సీఎస్‌కే టీమ్‌ను అభినందించారు ముఖ్యమంత్రి జగన్..
Read Also: Lucknow Horror:14 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం.. ఆపై సుత్తితో కొట్టి, ఫ్యాన్‌కు ఉరేసి.. !
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు క్రికెటర్ అంబటి రాయుడు.. అతడి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు.. సీఎస్‌కే టీమ్ సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని కూడా సీఎం జగన్‌కు బహుకరించారు రూపా గురునాథ్, అంబటి రాయుడు.. కాగా, ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోనీ సారథ్యం వహించిన సీఎస్‌కే టీమ్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది.. ఐదో సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక, ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ ఆడి రాయుడు ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు.. ట్రోఫీని కూడా అంబటి రాయుడు చేతుల మీదుగా అందుకుంది సీఎస్కే టీమ్.. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో క్రికెటర్ అంబటి రాయుడు సమావేశం కావడం ఇది రెండోసారి.. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు సీఎంను కలిసిన రాయుడు.. ఇప్పుడు కప్ కొట్టిన తర్వాత ఆ కప్ తీసుకొచ్చి కలిశారు.. ఈ భేటీలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. అంబటి రాయుడు త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం సాగుతోంది.