Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడటమనేది క్రికెట్ అభిమానుల చిరకాల కోరిక. ఇందుకోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలేమంటూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో విశ్వక్రీడల్లో క్రికెట్‌ను వీక్షించాలంటే అభిమానులు మరో కొన్నేళ్లుపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఒలింపిక్స్ తర్వాత 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం విశ్వక్రీడలకు వేదిక కానుంది. కనీసం ఈసారైనా క్రికెట్ చేర్చుతారేమో చూడాలి. ఇక, ఇప్పటి వరకు ఒలింపిక్ చరిత్రలో క్రికెట్‌ను ఒక్కసారి మాత్రమే చేర్చారు. పారిస్‌లో జరిగిన1900 విశ్వక్రీడల్లో క్రికెట్ భాగమైంది. కానీ ఆ తర్వాత మళ్లీ ఈ మెగాటోర్నీలో క్రికెట్‌కు అవకాశం రాలేదు. ఆ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్, ఆతిథ్య ఫ్రాన్స్ మాత్రమే రెండు జట్లుగా బరిలో దిగాయి.
Read Also : Viral : తాగిన ఒక్క బీరుకు.. బారెడంత బిల్లు వేసి మత్తు దించిన పోలీసులు
ఒలింపిక్స్‌లో ఏయే క్రీడలను చేర్చాలనే విషయమై గతేడాది ఫిబ్రవరిలో సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లో 28 క్రీడల్ని ఎంపిక చేశారు. కానీ ఆ తర్వాత మరో 8 క్రీడలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఇవి లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో భాగం కానున్నాయి. భవిష్యత్తులోనూ ఇతర క్రీడలను చేర్చవచ్చు, అందులో క్రికెట్ కూడా ఒకటి కూడా ఉంటుందనే ఆశలూ ఉన్నాయి. నిరుడు బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో దాదాపు 24 ఏళ్ల తర్వాత మహిళల క్రికెట్‌ను చేర్చారు. దీనికి ముందు 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఆడేవారు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీలకు భారత్‌తో సహా ఎనిమిది జట్లు అర్హత సాధించాయి.ఖర్చు, భద్రత, ఆతిథ్య దేశాల ఆసక్తిని పరిగణలోకి తీసుకుని ఒలింపిక్స్‌లో క్రీడలకు అవకశం కల్పిస్తారు.