Site icon NTV Telugu

Funny Viral Video: బాసూ.. నీలాంటోడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండాలి! అశ్విన్ కూడా ఏం..

Funny Viral Video

Funny Viral Video

Viral Video, Funny Incident in Local Cricket: క్రికెట్‌ అంటే ఫన్నీ గేమ్‌. ఈ ఆటలో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకుంటాయి. క్రికెట్‌లో కొన్ని సంఘటనలు అయ్యో పాపం అనుకునేలా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆహ అనిపిస్తాయి. ఇంకొన్ని మాత్రం కడుపుబ్బా నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బౌల‌ర్ రనౌట్ చేస్తాడని ముందే ఊహించిన నాన్‌స్ట్రైకర్‌.. క్రీజులో ఉన్న బ్యాటర్ వద్దకు వెళ్లి ఏవో సూచనలు ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఘటన ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో అనే వివరాలు తెలియకున్నా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూస్తే.. భారత్‌లో జరిగిన ఓ గల్లీ క్రికెట్‌లో ఈ ఫన్నీ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియో ప్రకారం.. కొందరు యువకులు మైదానంలో మ్యాచ్ ఆడుతుంటారు. చివరి బంతికి ఒక రన్ చేయాల్సి ఉంటుంది. బౌలర్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని విడవకముందే.. నాన్‌స్ట్రైకర్‌ క్రీజ్ వదిలేసి పరుగెత్తుతాడు. ఇది గమనించిన బౌలర్ బంతిని సంధించడు.

Also Read: Tilak Varma CWC 2023: వన్డే ప్రపంచకప్‌కు తిలక్ వర్మ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే?

బౌలర్ బంతిని వేయలేదని గమనించిన నాన్‌స్ట్రైకర్‌.. రనౌట్ చేస్తాడని ముందే ఊహించాడు. ఇక్కడే నాన్‌స్ట్రైకర్‌ తన తెలివి ప్రదర్శించాడు. బ్యాటర్ వద్దకు వెళ్లి.. అటు వైపు లేదా ఇటు వైపు షాట్ ఆడు అని సూచనలు ఇస్తుంటాడు. ఇది చూసిన బౌలర్ షాక్ తిని.. బౌలింగ్ వేసేందుకు వెళ్లిపోతాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. నీలాంటోడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉంటే.. ఆర్ అశ్విన్ కూడా ఏం పీకలేడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ టోర్నీలో యాష్ మ‌న్క‌డింగ్ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version