CRDA: ఈ-వేలం ద్వారా అమరావతి టౌన్ షిప్‌ స్థలాల అమ్మకం

Amaravathi Town Ship

Amaravathi Town Ship

జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ పథకంలో భాగంగా మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలో స్థలాలను అందించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి, నవులూరు పరిధిలో అమరావతి టౌన్‌షిప్‌లోని 331 స్థలాలను విక్రయించాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. ఆయా స్థలాలను ఈ-వేలంలో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ స్థలాలను సీఆర్‌డీఏ అధికారులు 12 లాట్‌లుగా విభజించారు. వీటిలో 200 చదరపు గజాల నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలాలు ఉన్నాయి.

Andhra Pradesh: ఏపీలో తగ్గిపోయిన సంతానోత్పత్తి.. కారణం ఏంటి?

×
×
Ad

తొలి లాట్‌గా 29 స్థలాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. అమరావతి టౌన్‌షిప్‌లో స్థలాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు శుక్రవారం (మే 13న) ఉదయం 11 గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చునని ఆయన సూచించారు. పేర్లు నమోదు చేసుకున్నవారికి ఈ నెల 31న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తామని తెలిపారు.