NTV Telugu Site icon

CRDA: సీఎం సమక్షంలో నేడు సీఆర్డీఏ భేటీ.. రాజధాని నిర్మాణంపై కీలక నిర్ణయం

Cbn 2

Cbn 2

CRDA: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షంలో ఈ రోజు సీఆర్డీఏ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది.. రాజధాని నిర్మాణాల పునః ప్రారంభంపై కీలక చర్చ సాగనుంది.. వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.. డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు మంత్రి నారాయణ. మరోవైపు.. ఇటీవలే రాజధానిలో ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు.. రాజధాని నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది ప్రపంచ బ్యాంక్, ఏడీబీ. అయితే, రాజధాని అమరావతిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాటుపై ఈ రోజు చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది.. కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు భూములు కేటాయించే అంశంపైనా చర్చించే అవకాశం ఉందంటున్నారు..

Read Also: Wrong Driving: దిమ్మతిరిగే షాక్.. రాంగ్ రూట్ లో వెళ్తే లైసెన్స్ లు రద్దు..

కాగా, గత ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని పక్కన బెట్టిన నేపథ్యంలో.. తమ హయంలో జరిగిన పనులు ఎక్కడ నిలిచిపోయాయి.. అవి పటిష్టంగా ఉన్నాయా? అనే అంశాలపై కూడా ప్రభుత్వం ఆరా తీసిన విషయం విదితమే.. రాజధాని ప్రాంతంలో పర్యటించిన నిపుణుల కమిటీ.. నిర్మాణాల స్థితి, పటిష్ఠతపై ప్రభుత్వానికి నివేదికలు అందజేసిన నేపథ్యంలో.. తిరిగి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది చంద్రబాబు సర్కార్..