Site icon NTV Telugu

Army Helicoptor Crash : కూలిన ఆర్మీ హెలీకాప్టర్.. లెఫ్టినెంట్ కల్నల్ మృతి

Helocoptor

Helocoptor

Army Helicoptor Crash : అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాలో ఆర్మీ హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. పైలట్ల జాడ కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమ్‌డిలా సమీపంలో ఆపరేషన్ సమయంలో ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన చితా హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. హెలికాప్టర్ తరువాత బొండిలాకు పశ్చిమాన మండల్ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు. పైలట్‌ల కోసం ఆర్మీ రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ ప్రారంభించింది.

Read Also: Tamanna Dead Body : లంచ్‎కు రమ్మన్నారు.. తమన్నాను చంపి డ్రమ్ములో పెట్టారు

గతేడాది అక్టోబర్‌ 5న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఆర్మీ చితా హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ పైలట్లకు గాయాలు కాగా వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉదయం 10 గంటల సమయంలో తవాంగ్‌లోని జెమిథాంక్ సర్కిల్‌లోని బాప్ టెంగ్ కాంగ్ జలపాతం సమీపంలోని న్యామ్‌జాంగ్ చు వద్ద ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సురవ సాంబ ప్రాంతం నుంచి ఇద్దరు పైలట్లతో హెలికాప్టర్లు నిత్యం సంచరిస్తుంటాయి.

Read Also: World Sleep Day : అతిగా నిద్ర పోతే.. మీరు ఉబ్బిపోతారు జాగ్రత్త

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది, ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్‌లను బయటకు తీసి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పైలట్లలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించారు. తవాంగ్‌లో ఇది మొదటి హెలికాప్టర్ ప్రమాదం కాదు. 2017లో వైమానిక దళానికి చెందిన Mi-17 V5 హెలికాప్టర్ కూలి ఐదుగురు IAF సిబ్బంది మరియు ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు.

Exit mobile version