NTV Telugu Site icon

Mumbai: అటల్ సేతు బ్రిడ్జిపై పగుళ్లు.. అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపణ

Mah

Mah

మహారాష్ట్రలో అటల్ సేతు బ్రిడ్జిపై రాజకీయ విమర్శలు హీటెక్కాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా విమర్శలు.. ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. రాకపోకలు ప్రారంభించిన నెలల వ్యవధిలోనే అటల్‌ సేతు వంతెనపై పగుళ్లు ఏర్పడ్డాయంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు‌ నానా పటోలే ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు అటల్‌ సేతు పగుళ్లు ఏర్పడిన ప్రాంతానికి మీడియాను వెంట తీసుకెళ్లారు. పగుళ్లు పరిశీలించి.. మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా అటల్‌ సేత నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. వంతెన నిర్మాణంలో నాణ్యతలేదన్నారు. కాబట్టే పగుళ్లు ఏర్పడ్డాయని, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని కర్రతో పరిశీలించారు.

ఇది కూడా చదవండి: Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 36కు చేరిన మృతులు

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అటల్ సేతు వంతెన ప్రారంభోత్సవం జరిగిన కొన్ని నెలల్లో ఒక భాగం పగుళ్లు ఏర్పడిందని.. నిర్మాణ కోసం రూ.18,000 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. బీజేపీతో పాటు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాత్రం ఈ పగుళ్లు బ్రిడ్జిపైన కాకుండా నవీ ముంబైలోని ఉల్వే రహదారిపై ఏర్పడ్డాయని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Rain season: పిల్లల పట్ల పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

అటల్ సేతుపై దుష్ప్రచారం ఆపండి అంటూ బీజేపీ ఎక్స్‌ వేదికగా స్పందించింది. ‘‘ఇది సర్వీస్ రోడ్డు. ఇది ప్రధాన వంతెనకు అనుసంధానించే భాగం. ఇవి చిన్నపాటి పగుళ్లు. రేపు సాయంత్రంలోగా వాటిని సరిచేస్తాం. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడలేదు’’ అని అటల్‌ సేతు ప్రాజెక్ట్‌ హెడ్‌ కైలాష్ గణత్ర తెలిపారు.