NTV Telugu Site icon

Gun Culture: గన్‌కల్చర్‌పై కన్నెర్ర.. ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు

Gun Culture

Gun Culture

Gun Culture: పంజాబ్‌లో తుపాకీ సంస్కృతిపై అణిచివేత కొనసాగిస్తూ భగవంత్-మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం 813 ఆయుధాల లైసెన్స్‌లను రద్దు చేసింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు 2,000 పైగా ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేసింది. లూథియానా రూరల్‌ నుంచి 87, షాహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌ నుంచి 48, గురుదాస్‌పూర్‌ నుంచి 10, ఫరీద్‌కోట్‌ నుంచి 84, పఠాన్‌కోట్‌ నుంచి 199, హోషియాపూర్‌ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్‌ఏఎస్‌ కస్బా నుంచి 235, సంగర్‌ నుంచి 16 లైసెన్స్‌లు రద్దయ్యాయి. అమృత్‌సర్ కమిషనరేట్‌లో 27 మంది, జలంధర్ కమిషనరేట్‌తో పాటు అనేక జిల్లాలకు చెందిన 11 మంది లైసెన్స్‌లు కూడా రద్దు చేయబడ్డాయి.

తుపాకులు ఉంచడానికి కొన్ని నియమాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాలకు ఆయుధాలను తీసుకెళ్లడం, ప్రదర్శించడంపై ఇప్పుడు నిషేధం ఉందని పేర్కొంది. రాబోయే రోజుల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో రాండమ్ చెకింగ్‌లు కూడా నిర్వహిస్తారని, హింస, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంపై పూర్తి నిషేధం ఉంటుందని అధికార ఆప్ ప్రభుత్వం తెలిపింది. క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్షాల నిరంతర దాడుల మధ్య.. అమృత్‌సర్, ఫరీద్‌కోట్‌లలో లక్ష్యంగా చేసుకున్న హత్యల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఈ అణిచివేత కార్యక్రమం చేపట్టింది.

Read Also: Same Gender Marriage: స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వడం కుదరదు.. తేల్చిచెప్పిన కేంద్రం

పంజాబ్‌లో మొత్తం 3,73,053 ఆయుధాల లైసెన్స్‌లు ఉన్నాయని, తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.ఇటీవల, పంజాబ్ పోలీసులు కూడా అమృత్‌పాల్ సింగ్‌కు చెందిన తొమ్మిది మంది సహాయకుల ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేయాలని అమృత్‌సర్ జిల్లా పరిపాలనను కోరారు. లైసెన్సులు ఆత్మరక్షణ కోసం ఇవ్వబడ్డాయని, ఖలిస్తానీ నాయకుడికి భద్రత కల్పించడం కోసం కాదని పేర్కొంది. ఇటీవల పంజాబ్ ప్రభుత్వం రాడికల్ నాయకుడు అమృతపాల్ సింగ్‌కి లొంగిపోయింది. అతని మద్దతుదారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. అతని సన్నిహితుడు తూఫాన్ సింగ్‌ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అమృత్‌సర్ సమీపంలోని అజ్నాలాలోని పోలీసు కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారు. గతేడాది ప్రముఖ పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసావాలాను కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. నేపథ్యంలో తుపాకీ సంస్కృతి నియంత్రణపై దృష్టి సారించింది.

Show comments