NTV Telugu Site icon

CPM: మరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం

Cpm Bus Yatra

Cpm Bus Yatra

CPM: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం పార్టీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా, ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను ఇప్పటికే సీపీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు.

Also Read: CM KCR: కాంగ్రెస్ సరిగ్గా పాలిస్తే దేశం దుస్థితి ఇలా ఉండేదా?

తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీపీఎం పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థులను నిన్న ప్రకటించామన్నారు. ఇవాళ మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు. కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు పోటీ చేస్తారని తెలిపారు. మునుగోడులో గతంలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్నికల బరిలోకి రాబోతున్నారని.. వారిని సీపీఐ పార్టీ సమర్థిస్తుంది కానీ సీపీఎం పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. మునుగోడు అభ్యర్థిగా సీపీఎం సీనియర్ నాయకుడు దోనూరి నర్సిరెడ్డిని పోటీలో ఉంచుతామన్నారు. ఇల్లందు స్థానంలో కూడా మేమే అనివార్యంగా పోటీ చేయాల్సి వస్తుంది.. అక్కడ దుగ్గి కృష్ణను సీపీఎం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంచుతున్నామన్నారు.

Also Read: Revanth Reddy: 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నామినేషన్ వేయను..

మేము అభ్యర్థులను నిలబెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పందించిందన్నారు. సీపీఐ పార్టీ ఏ విధంగా అయితే ఒక సీటును తీసుకొని ఒప్పందం కుదుర్చుకున్నారో.. మీరు కూడా అలానే సర్దుకోవాలని చెప్పినా మేం వ్యతిరేకించామని తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఈ విషయాన్ని మా కేంద్ర కార్యవర్గానికి కూడా తెలియజేసి బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మేము ఎలా ముందుకు వెళ్తామని సమాధానం చెప్పడంతో… వారి సలహా మేరకు మా రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం మేరకు స్వతంత్రంగా పోటీ చేయడమే ముఖ్యమని మేము ప్రజల్లోకి పోబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇక చర్చలేమీ లేవని, మేము స్వతంత్రంగానే ఎన్నికల్లో దిగుతున్నామన్నారు. ఇక మిగిలిన స్థానాలకు వచ్చేసి గతంలోనే చెప్పామన్నారు. ప్రజాస్వామికవాదులు, బీఎస్పీ భావజాల పార్టీ లాంటి వాటితో మేము కలిసి వెళ్లబోతున్నామన్నారు. బీజేపీ పార్టీ పోటీ చేసే స్థానాలలో కచ్చితంగా ఆ అభ్యర్థులను ఓడించాలని మాత్రమే మేము ప్రజలకు సూచిస్తున్నామన్నారు. ఏ ఒక్కరి గెలుపుకోసమో ఏ ఒక్కరి ఓటమి కోసమో సీపీఎం పార్టీ పని చేయదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

సీపీఎం మొదటి జాబితా

1) భద్రాచలం : కారం పుల్లయ్య

2) అశ్వారావుపేట : పిట్టల అర్జున్

3) పాలేరు : తమ్మినేని వీరభద్రం

4) మధిర : పాలడుగు భాస్కర్

5) వైరా : భూక్యా వీరభద్రం

6) ఖమ్మం : ఎర్ర శ్రీకాంత్

7) సత్తుపల్లి : మాచర్ల భారతి

8) మిర్యాలగూడ : జూలకంటి రంగారెడ్డి

9) నకిరేకల్ : బొజ్జ చిన్న వెంకులు

10) భువనగిరి : కొండండుగు నర్సింహ

11) జనగాం : మోకు కనకా రెడ్డి

12) ఇబ్రహీంపట్నం : పగడాల యాదయ్య

13) పటాన్​చెరు : జే.మల్లికార్జున్

14) ముషీరాబాద్ : ఎమ్. దశరథ్

సీపీఎం రెండో జాబితా

1) హుజూర్‌నగర్‌-మల్లు లక్ష్మి

2) నల్గొండ- ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి