NTV Telugu Site icon

Srinivasa Rao: ఎన్నికల సంఘంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆరోపణలు.. ఏమన్నారంటే?

New Project (24)

New Project (24)

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల అక్రమాలను కమిషన్ పట్టించుకోవడం మానేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేయలేదన్నారు. ఎన్నికల సజావుగా జరగా పోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం… బీజేపీ అడ్డుపెట్టుకొన్న తెలుగుదేశం కారణంగానే ఓటరు హక్కుని హరించారన్నారు. పోరాటాలు చేస్తున్న ఇండియా కూటమి పైన కేసులు నమోదు చేశారని తెలిపారు. కోట్ల రూపాయలు చలామణి చేస్తున్న వారిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు ఫలితాలకు ముందే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే మోడీ ఎన్నికల కమిషన్ ని గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. బూత్ లెవెల్ లో ఓటింగ్ అడిగితే ఇవ్వలేని పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఉందన్నారు.

READ MORE: EVMs: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లు.. ఈసీ క్లారిటీ

కాగా.. కేంద్రంలో ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోగా కచ్చితమైన పోలింగ్‌ శాతం వివరాలను తెలిపేలా ఆదేశించాలని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ అంశంపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పోలింగ్ వివరాలు ఈసీ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా చూడాలని పేర్కొంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో తారుమారు చేసే పద్ధతులు ఉండకూడదని అభిప్రాయపడింది. సాధారణంగా ఎన్నికల సంఘం పోలింగ్‌ రోజే సాయంత్రం ఆ రోజు ఎంత శాతం ఓటింగ్ నమోదైందన్న ప్రాథమిక వివరాలు వెల్లడిస్తుంది. కాని కచ్చితమైన వివరాలు వెల్లడించేందుకు సాధ్యం కాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు.