Site icon NTV Telugu

Tammineni Veerabhadram: బీఆర్ఎస్‌తో సీపీఎంకు ఎలాంటి సంబంధాలు లేవు: తమ్మినేని వీరభద్రం

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

CPM has no relation with BRS Says CPM Leader Tammineni Veerabhadram: తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్‌ పార్టీతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. దేశంలో కుల గణన పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తుందని, ఇండియా కూటమి మాత్రమే దేశంలో కుల గణన చేయగలదన్నారు. బీజేపీ పార్టీ వ్యతిరేక పార్టీలతో తమకు కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామని వీరభద్రం తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు అయిన సీపీఎం, సీపీఐలు రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుల గురించి చర్చలు చేస్తున్న విషయం తెలిసిందే.

నల్లగొండ జిల్లాలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… ‘బీజేపీ పార్టీ వ్యతిరేక పార్టీలతో కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నాం. మిర్యాలగూడలో సీపీఎం అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. దేశంలో కుల గణన పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తుంది. ఇండియా కూటమి మాత్రమే దేశంలో కుల గణన చేస్తుంది. తెలంగాణలో బీజేపీ, మజ్లీస్ పార్టీలతో బీఆర్ఎస్ సన్నిహితంగా ఉంటుంది. బీఆర్ఎస్‌తో సీపీఎంకు ఎలాంటి సంబంధాలు లేవు’ అని తెలిపారు.

Also Read: Minister Srinivas Goud: ప్రజలు నా వైపే ఉన్నారు.. మళ్లీ గెలుపు నాదే: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌

‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలతో బీఆర్ఎస్ పార్టీకి వణుకు పుడుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో మా డిమాండ్లకు అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వల్ల రైతు కూలీలకు కూడా తగిన న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ధైర్యం ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను తలదన్నే పథకాలను ప్రకటించాలి’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు.

 

Exit mobile version