CPl Narayana about Congrss Alliance: తమని కాదని కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుదిరిందని, సీట్ల సర్దుబాటు ఇంకా కుదరాల్సి ఉందన్నారు. కమ్యూనిస్టులది విశాల హృదయం అని, చట్ట సభల్లో తమ వాయిస్ ఉండాలనేదే ఆలోచన అని నారాయణ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల గురించి చర్చలు జోరుగా జరుగుతున్నాయి.
గత ఎన్నికల్లో మహాకూటమిలో కమ్యూనిస్టు పార్టీలు అయిన సీపీఎం, సీపీఐలను కలుపుకున్న కాంగ్రెస్.. ఈ సారి కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో వామపక్ష పార్టీల ప్రాబల్యం ఉండటంతో.. దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీలు కూడా పొత్తుకు సై అంటున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పొత్తుల గురించి సీపీఎం, సీపీఐలతో చర్చలు సాగిస్తున్నారు. మునుగోడు, భద్రాచలం, కొత్తగూడెం, మిర్యాలగూడ టికెట్లను వామపక్ష పార్టీలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
సీపీఐ నారాయణ తాజాగా మాట్లాడుతూ… ‘తెలంగాణలో పొత్తులపై చర్చ జరుగుతుంది. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు కొన్నిచోట్ల అన్యాయం జరుగుతుంది. బలం ఉన్న చోట పోటీ చేస్తాం. పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఇండియా కూటమితో ఉన్నాం, ఉంటాం కూడా. భట్టి రెండు పార్టీలతో చర్చ చేస్తున్నారు. రాజకీయ అవగాహన కుదిరింది. సీట్ల సర్దుబాటు ఇంకా కుదరాల్సి ఉంది. గందరగోళం ఏం లేదు. చట్ట సభల్లో మా వాయిస్ ఉండానేదే మా ఆలోచన. మమ్మల్ని కాదని కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రాదు. కమ్యూనిస్టులది విశాల హృదయం’ అని అన్నారు.
Also Read: Shubman Gill Out: అనుకోని అదృష్టం.. భారత ప్రపంచకప్ జట్టులో ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్!
‘కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బదిలీలపై దృష్టి సారించాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అనుకూల పోలీసు అధికారులకు పోస్టింగ్‌లను ఆపాలి. ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చాక పథకాల అమలులో వేగం పెంచడాన్ని కూడా ఆపాలి. ఆరు నెలల ముందే వాగ్దానం చేయాలి, అమలు చేయాలి కానీ.. షెడ్యూల్ వచ్చాక హడావుడి చేయడం అక్రమాలకు దారి చూపడమే అవుతుంది. పోలింగ్‌కి ముందే రైతుబంధు వేశారు. ఒకే ఇంట్లో 70 వేలు వస్తే ఓటు ఎలా వేస్తారు?. అధికార పార్టీలకు అనుకూలంగా కేంద్ర ఎన్నికల అధికారుల వ్యవహారం నడుస్తుంది. అధికార పార్టీకి ప్రయివేట్ సైన్యం ఇవ్వండి సరిపోతుంది’ అని నారాయణ పేర్కొన్నారు.