Site icon NTV Telugu

CPI Ramakrishna: పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవా?

Cpi Ramakrishna

Cpi Ramakrishna

పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అంటూ సీపీఐ రాష్ట్ర కారదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం విలీన మండలాల ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలాగా మారిందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏటపాక, చింతూరు, వర రామచంద్రపురం, కూనవరం మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనమయ్యాయని ఆయన తెలిపారు. ఆయా మండలాల ప్రజలు ప్రతి ఏటా గోదావరి వరద బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని సీపీఐ రామకృష్ణ అన్నారు.

Read Also: Baby: బేబీ కోసం కదిలొస్తున్న మెగాస్టార్!

గత సంవత్సరం 70 అడుగుల మేర గోదావరి వరదలు వచ్చినప్పుడు సీఎం జగన్ సర్కార్ కనీస చర్యలు చేపట్టలేదని సీపీఐ రాష్ట్ర కారదర్శి రామకృష్ణ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు పునరావాసం, సహాయక చర్యలు చేపడుతుంటే ఏపీ సర్కార్ మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గమన్నారు. పోలవరం విలీన మండలాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని వైసీపీ ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కారదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

Read Also: Ginger Cultivation : అల్లం సాగులో తీసుకోవాల్సిన మెళుకువలు..

ఇప్పటికైనా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వరదలతో నష్టపోయిన బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కారదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. వరదల వల్ల సర్వం కోల్పోయిన రైతులను, లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు, విలీన మండలాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని ఆయన కోరారు.

Exit mobile version