Ramakrishna: బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్లాక్ మెయిల్తో బీజేపీ అందర్నీ లొంగ తీసుకుంటోందని ఆరోపించారు. సీబీఐ, జ్యూడిషియల్ ని గుప్పట్లో పెట్టుకుని అధికారంలోకి వస్తామంటున్నారని తెలిపారు. అధికారం కోసం పక్కా మైండ్ గేమ్ తో ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ లను మోడీ, అమిత్ షా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు జైల్ కి వెళ్లాడనికి కారణం మోడీ, అమిత్ షాలేనని రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోని 90శాతం మందికి ఇది తెలుసు.. బీజేపీతో కలవద్దని వారు చెబుతున్నారన్నారు.
Read Also: Chegondi Harirama Jogaiah: ‘కాపులకు మేలుకొలుపు’ పేరుతో హరిరామజోగయ్య లేఖ..
మరోవైపు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సైతం ఎన్డీయే కూటమిలో చేరాలని మోడీ భయపెడుతున్నాడని పేర్కొన్నారు. జగన్ వై నాట్ 175 అంటే.. మోడీ 370 అని అంటున్నారని తెలిపారు. కాగా.. రానున్న ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీలతో ఎన్నికల్లో ముందుకెళ్లాలో సీపీఐ, సీపీఎం నిర్ణయించుకుంటాయని రామకృష్ణ తెలిపారు. అందుకోసం ఈనెల 20న విజయవాడలో సమావేశం అవుతున్నామని అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ అవకతవకలకు కారణం ఐఏఎస్, ఐపీఎస్లేనని పేర్కొన్నారు. దొంగ ఓట్లకు కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: AP DSC 2024 Notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు మీ కోసం..