NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao: ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేయాలి..

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటివరకు అమలు చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేయాలన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉండాలని.. ఈ పథకాలు అమలు చేయలేం అని చెప్పాలన్నారు. శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయలేకపోతే ప్రజలను క్షమించమని అడగాలన్నారు. ఆలస్యం అయినా పర్వాలేదు కానీ కచ్చితంగా అమలు చేయాలన్నారు.

Read Also: MP Raghunandan Rao: బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. ఎంపీ రఘునందన్‌ రావు కీలక వ్యాఖ్యలు

లేదంటే బీఆర్‌ఎస్, బీజేపీ వాళ్ల ట్రాప్‌లో పడుతారన్నారు. బీఆర్ఎస్ ఎలా అయినా బతకాలని చూస్తోందన్నారు. హైడ్రాతో కబ్జాలు చేసిన పెద్దవాళ్ల గుండెల్లో గుబులు రావాలి.. కానీ చిన్న వాళ్లను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. పెద్దవాళ్ళు ఎంత కబ్జా చేశారో చూడాలన్నారు. పేదవాళ్ళ కు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొంతమంది భూమికి నకిలీ పేపర్లు సృష్టించి భూములు కబ్జా చేస్తున్నారని కూనంనేని పేర్కొన్నారు.

Show comments