Site icon NTV Telugu

Ramakrishna: హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి..

Ramakrishna

Ramakrishna

Ramakrishna: తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఎందుకు ఆచరించలేదు? అని ప్రశ్నించారు.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న విషయం ఏమైంది? అని నిదీశారు.. విభజన చట్ట హామీల అమలు, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి నిధుల సంగతేమైంది?.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు జరగలేదు?.. కేంద్రంపై ఒత్తిడి పెంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోయారు?.. ‘మాట తప్పి, మడమ తిప్పటం’ తప్ప జగన్ ఈ నాలుగేళ్లలో ఏం సాధించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు రామకృష్ణ..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

కాగా, ఏపీ మంత్రులపై మరోసారి ఫైర్‌ అయ్యారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు.. నేను ఆంద్రప్రదేశ్ ప్రజల్ని తిట్టింది లేదు.. ఏం చేసింది లేదన్న ఆయన.. అయినా కొంత మంది నాయకులు ఎగేరిగిరి పడుతున్నారు అంటై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏపీ ప్రజల పక్షాన మాట్లాడాను.. మీకు చేతనైతే ఏపీకి జాతీయ హోదా కోసం పోరాడండి, విశాఖ ఉక్కు కోసం పోరాడండి, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి మా కాళేశ్వరం లాగా నీళ్లు అందించి మాట్లాడండి అంటూ సవాల్‌ చేశారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్న హరీష్‌రావు.. మా తెలంగాణ ఎంత గొప్పగా ఉందో పక్క రాష్ట్రాలతో పోల్చి చెప్పాను అంతే అని సోమవారం స్పష్టం చేసిన విషయం విదితమే.

Exit mobile version