CPI Ramakrishna: ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్‌పై మరోసారి ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, బెంగళూరులోని బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు.. బీజేపీ, ఎన్నికల కమిషన్ పై రామకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు.. దేశంలో దొంగల పాలన సాగుతోంది.. నరేంద్ర మోడీ, అమిత్ షా మొత్తం దొంగ ఓట్లు వేసుకున్నారు.. రేపు బీహార్ లో జరిగే ఎన్నికల కోసం 60 లక్షల ఓట్లు తీసేశారు.. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారు. మొత్తం దొంగల రాజ్యం నడుస్తుంది.. ఎన్నికల సంఘానికి సిగ్గు ఉందా? అంటూ ఫైర్ అయ్యారు..
Read Also: Chiranjeevi: నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు.. పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ!
ఇక, పూర్తి సమాచారంతో రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే మాకు సమాచారం ఇవ్వాలని అడుగుతారా…? అంటూ ఈసీ మండిపడ్డారు రామకృష్ణ.. ఎన్నికల కమిషన్ బీజేపీకి అమ్ముడుపోయి లాలూచీ పడింది అని ఆరోపించారు.. ఈ సమస్య కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఒక్కరిదీ కాదు.. మోడీ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.. అంబేద్కర్ రాజ్యాంగం వల్ల అందరూ కలిసి ఉన్నాము. కానీ, బీజేపీ కొత్త రాజ్యాంగం రాసుకుంటాం అని అంటున్నారు… రైతుల బాధలు, కష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా…? మీరు దేశంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి..? అని నిలదీశారు.. తప్పుడు కేసులు పెట్టీ అందరిని జైళ్లకు పంపించారు.. బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నారు… దేశంలోనే సీనియర్ నేత అని చెప్పుకునే చంద్రబాబు దొంగ ఓట్ల పై ఎందుకు మాట్లాడడం లేదు.. ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన నాయకుడు ఏం మాట్లాడడం లేదు… అధికారంలో మీరే ఉన్నారు కదా తిరుపతి లడ్డు కల్తీ పై ఎం చర్యలు తీసుకున్నారో చెప్పండి..? అని ప్రశ్నించారు. ఇక, మోడీని చూసి రాష్ట్రంలోని మూడు పార్టీలు భయపడుతున్నాయి… డబుల్ ఇంజన్ సర్కార్ ప్రతి మంగళవారం నాలుగు నుంచి ఐదు వేల కోట్ల అప్పు చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
