NTV Telugu Site icon

CPI Ramakrishna: పోలవరం ఎప్పటికి పూర్తిచేస్తారో చెప్పాలి?

Cpi Ramakrishna

Cpi Ramakrishna

ఏపీ జనం పాలిట వరం పోలవరం.. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టు పోలవరం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.. 2020 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడారు. నాలుగు నెలల నుండి సోమశిల జలాశయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.

Read Also: Tripura Elections: త్రిపురలో ప్రశాంతంగా ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే!

రాష్ట్రంలోని జలాశయాల పరిస్థితి పై కేంద్ర జల వనరుల శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ కు నివేదిక అందజేస్తాం..ఎన్నికల దృష్ట్యా కర్ణాటక జలాశయాలకు నిధులు ఇస్తూ .ఏపీకి కేంద్రం మొండి చేయి చూపింది. రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన తన కడుపులో ఉన్నది ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్కా మోసంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థలపై కూడా గౌరవం లేదు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని చేసినా అమరావతి రాజధానిగా నిలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు రామకృష్ణ.

Read Also: Job Fraud: ఘరానా మోసం.. యూరప్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి..