చంద్రబాబు విషయంలో సోము వీర్రాజు కామెంట్లు వ్యంగ్యంగా అన్నవని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం దద్దమ్మలు కనుక రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదని ఆయన అన్నారు. అత్యధిక దరిద్రులు ఉన్న దేశంగా మన దేశాన్ని మార్చేసారని ఆయన విమర్శలు గుప్పించారు. 9 ఏళ్ళ మోడీ పాలనలో సాధించింది చేసింది ఏమీ లేదని ఆయన తెలిపారు. ఒకేసారి జూన్ నెలలో మూడుసార్లు స్పాట్‌ఆఫ్ చార్జీలు పెంచడం, దీనికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం…దాని భారం మీ మీద వేస్తాం అని చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్మార్ట్ మీటర్లు, స్పాట్ ఆఫ్ చార్జీలు పెంచకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిపారు.
Also Read : Crispy Gobi 65 : రెస్టారెంట్ స్టైల్‌లో గోబీ 65.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..
విద్యుత్ స్మార్టు మీటర్లు పెట్టమని ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసారా అని ఆయన ప్రశ్నించారు. అమూల్ కు భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని రామకృష్ణ వెల్లడించారు. విశాఖలో ఈనెల 11న వామపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. అనంతరం ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ సీ.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ.. రేపు అన్ని పార్టీల సమక్షంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాకు స్ధిరమైన సర్టిఫికేట్ లు ఇవ్వాలని కోరుతూ రేపు సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ పూర్తయిన మా అందరికీ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ సర్వీస్ ప్రొవైడర్లుగా మాకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నామని ఆయన అన్నారు.
RBI : 1000 రూపాయల నోటు మళ్లీ వస్తుందా? ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారు?