Site icon NTV Telugu

CPI Ramakrishna : ప్రజాస్వామ్య సంస్ధలను ధ్వంసం చేస్తున్నారు

Cpi Ramakrishna

Cpi Ramakrishna

77 సంవత్సరాల స్వతంత్రం తరువాత కూడా మౌళిక సదుపాయాల సమస్యలు అలాగే ఉన్నాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య సంస్థలను ధ్వంసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు గౌరవించడం లేదని, కులమత సామరస్యం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ వల్ల దేశ వ్యాప్తంగా అశాంతి నెలకొని ఉందని, ప్రజాస్వామ్య హక్కుగా ప్రశాంతంగా సభలు ర్యాలీలు నిర్వహించుకునే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి అందరూ ముందుకు రావాలన్నారు సీపీఐ రామకృష్ణ.

Also Read : CM Jagan : గ్రామస్వరాజ్యానికి నిజమైన అర్థాన్ని తమ ప్రభుత్వంలో నిరూపించాం

ఇదిలా ఉంటే.. ఇటీవల అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలని వ్యాఖ్యానించారు సీపీఐ రామకృష్ణ. అసెంబ్లీ, పార్లమెంట్‌లోకి సామాన్య ప్రజలు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని, కోటీశ్వర్లు, కార్పోరేట్ శక్తులు మాత్రమే చట్టసభల్లోకి వెళ్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు సీపీఐ రామకృష్ణ. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టకుండా పోలీసులు, కార్యకర్తల్ని అడ్డంపెట్టుకుని అడ్డుకుంటున్నారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. చిత్తూరు జిల్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్తే పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ కార్యకర్తలు రాళ్ళు వేశారని, తిరిగి చంద్రబాబుపైనే 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారని మండిపడ్డారు. జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టివేసినా రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టాలని రామకృష్ణ అన్నారు సీపీఐ రామకృష్ణ.

Also Read : Wamiqa Gabbi: వామికా.. ఏంటి ఘోరం.. పైనేమో నిల్.. కిందేమో ఫుల్

Exit mobile version