చంద్రబాబు శ్వేతపత్రాలు, జగన్ ప్రకటనలతో ప్రజలు అయోమయంలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏ రంగంలో దేశ అభివృద్ధి జరిగిందో సీనియర్ నాయకుడు చంద్రబాబు చెప్పాలని అన్నారు. 1.2 లక్షల రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే అభివృద్ధి అని ఎలా చెపుతారని ప్రశ్నించారు. 40% గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం రికార్డులు దగ్ధం కారణంగా హైలైట్ అయిందన్నారు. బద్వేలు నియోజకవర్గంలోనే 30 వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపణ ఉందని రామకృష్ణ తెలిపారు. మదనపల్లె మాత్రమే కాదు.. మిగతా అన్ని చోట్లా ప్రభుత్వం పరిశీలించాలని ఆయన కోరారు.
Read Also: Nithya Pellikoduku: మహిళల్ని మోసం చేస్తూ 20కి పైగా పెళ్లిళ్లు.. నిత్యపెళ్లికొడుకు అరెస్ట్..
సీనియర్ ఐఏఎస్ అధికారితో రాష్ట్ర వ్యాప్తంగా భూముల అన్యాక్రాంతం పై సమగ్ర విచారణ జరపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. జూలై 31న సీఎం చంద్రబాబును భూముల అన్యాక్రాంతంపై కలవాలని నిర్ణయించామని తెలిపారు. పదేళ్ళ పాలనలో అవినీతి తగ్గిందా.. పారిపోయిన వాళ్ళను తెచ్చి శిక్షించారా అని ప్రశ్నించారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఇండియా పేదరికంలో నంబర్ 1 అయిందని ఆరోపించారు. రాష్ట్రంలో అప్పు పై చంద్రబాబు, యనమల, జగన్, బుగ్గన రకరకాలుగా చెపుతున్నారన్నారు. ప్రపంచ బ్యాంకు ద్వారా లోన్ కి నిర్మలా సీతారామన్, మోడీ అక్కర్లేదు.. చంద్రబాబు తానే ప్రపంచ బ్యాంకు నుంచీ తెచ్చుకోగలడని తెలిపారు. ఆర్థిక పరిణామాల పైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని రామకృష్ణ పేర్కొన్నారు.
Read Also: Paris Olympics 2024: భారత్ ఖాతాలో తొలి పతకం..చరిత్ర సృష్టించిన మను భాకర్