D Raja: బీజేపీ హటావో… దేశ్ బచావో.. అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ప్రధాని మోడీ ప్రతిపక్షాల మీద తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారన్న ఆయన.. మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, తెలంగాణలలో ఎన్నికలు జరుగుతున్నాయి.. మోడీ పాలనా వైఫల్యాలను ప్రజలు గమనించారని తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో మోడీ పాలనా వైఫల్యాలు ప్రతిభింస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మైనారిటీల పట్ల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసమానతలు ఉన్నాయి.. అన్ని సెక్యులర్ పార్టీలు కలిసి బీజేపీని గద్దె దించాలన్నారు. ఇండియా కూటమి రోజు రోజుకు బలపడుతోందన్న ఆయన.. మోడీ పాలనలో చేసిన పనులు అన్నీ వైఫల్యాలే… ఆకలితో అలమటిస్తున్న వారు భారతదేశంలో ఎక్కువైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: IPL Auction 2024: ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ట్రేడింగ్ విధానం ద్వారా కెప్టెన్ మారాడు!
అదానికి భారతదేశంలో ఉన్న పోర్టులు అప్పజెప్పారు అని మండిపడ్డారు రాజా.. నిరుద్యోగ యువత పెరిగిపోయారు.. వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.. మోడీ పాలనలో రూపాయి విలువ పడిపోయింది.. ఆర్ధిక విధానాలు దారుణంగా ఉన్నాయి.. అసమానతలు, కుల మత విధానాలు భారతదేశంలో పెంచుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెంలో జనసమూహం అత్యధికంగా వచ్చారని తెలిపారు. అయితే, సీపీఐ, సీపీఎం ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. ఇక, చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితి గురించి అడిగి తెలసుకున్నానని.. చంద్రబాబు అరెస్టు పై నిజాలు నెమ్మదిగా బయటకి వస్తాయని వెల్లడించారు.. చంద్రబాబు నాకు దశాబ్దాలుగా పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.