NTV Telugu Site icon

CPI Narayana : బిగ్‌బాస్‌ బ్రోతల్‌హౌస్‌ అన్న వ్యాఖ్యల్ని సమర్థించుకున్న నారాయణ

Cpi Narayana

Cpi Narayana

తెలంగాణలో ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు వడివడిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్‌ అవర్‌కు నేడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. బీజేపీని ఓడించేందుకు మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దుతు ఇచ్చాం. ఇండియా కూటమిలో మేము కూడా ఉన్నాం. బీఆర్‌ఎస్‌కు బీజేపీతో రాజకీయ అవగాహన ఉంది. ఎవరు ఎక్కడిదాకా కలిసి వస్తే.. వాళ్లతో అన్ని రోజులు కలిసి ఉంటాం. చట్టసభల్లో ఉండాలంటే.. ఒంటరిగా పోటీ చేయడానికి సాధ్యంకావడం లేదు. సర్దుబాటు ధోరణిలోనే రాజకీయ అవగాహన ఉంటుంది. లెఫ్ట్‌ పార్టీల ప్రస్తుత పరిస్థితికి స్వయంకృతాపరాధమే కారణం.

China: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో చైనా శాంతి దూత అవుతుందా?

పార్టీ విడిపోకుండా ఉంటే.. మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒకే జెండాగా ఉందామని నేను మొదటి నుంచి చెబుతున్నా. కలిసిపోదామని సీపీఐ పెడుతున్న ప్రతిపాదనకు సీపీఎం అంగీకరించడంలేదు. తమ పార్టీతో ఏం సంబంధంలేని వారికి ఫార్వర్డ్‌ బ్లాక్‌ టికెట్లు అమ్ముకుంది. కోటి రూపాయలకు ఫార్వర్డ్‌ బ్లాక్‌ టికెట్లు అమ్ముకుంది. టికెట్లు అమ్ముకున్నారు.. అన్నింటికీ ఆధారాలు దొరకవు. కోటి రూపాయలా, 10 లక్షలా అనేది నిరూపించలేను కానీ.. డబ్బులకు టికెట్లు అమ్ముకున్న మాట వాస్తవం. బిగ్‌బాస్‌ బ్రోతల్‌హౌస్‌ అన్న వ్యాఖ్యల్ని సమర్థించుకున్న నారాయణ. నేను ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా కాంట్రవర్శీ చేయను. బిగ్‌బాస్‌ అనైతికంగా అనిపించింది, అందుకే విమర్శించాను. ఏ సంబంధంలేని 50 మంది.. ఒకే ఇంట్లో ఉండటాన్ని ఏమనాలి.’ అని సీపీఐ నారాయణ జవాబిచ్చారు.

Guntur kaaram : సెకండ్ సాంగ్ రిలీజ్ అప్పుడేనా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..?

Show comments