NTV Telugu Site icon

CPI Narayana : వచ్చే నెల 2, 3 తేదీల్లో తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు

Cpi Narayana

Cpi Narayana

వచ్చే నెల 2, 3 తేదీల్లో తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయ పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని చర్చిస్తామన్నారు. దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని, కక్కిన కూడు కుక్కలు కూడా తినవ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని సీపీఐ నారాయణ అన్నారు. అయోధ్య రామాలయం ఎన్నికల స్టంట్ అని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా అయోధ్య రామాలయమని, రాముడు ఇంటింటికీ అక్షింతలు పంపించి లబ్ధి పొందాలని అర్ఎస్ఎస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తీర్పులు చెప్పే న్యాయ మూర్తులు సైతం అయోధ్యకు వెళ్ళారని, అందరినీ అయోధ్యకు రమ్మని ఆహ్వానించారు కానీ ఎల్కే అద్వానీకి మాత్రం రావద్దని ఆహ్వానం పంపారన్నారు. న్యాయస్థానాలు, విచారణ సంస్థలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయని, రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లడగటం మొదలుపెట్టిందన్నారు. కుల ఘనన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన మండిపడ్డారు. మోడీ పదేళ్ల పాలనలో పబ్లిక్ సెక్టార్ లు అమ్మడం తప్ప కొత్తగా స్థాపించినవి లేవన్నారు. దేశంలో పబ్లిక్ సెక్టార్ లన్నీ ధ్వంసం అయ్యాయన్నారు. రాముడి పేరుతో, మత విద్వేషాలు రెచ్చ గొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారీ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

అంతేకాకుండా..’ భారత దేశం హిందు దేశం కాదు.. ఇక్కడ అన్ని మతాల వారు ఉన్నారు.. దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఓటు బ్యాంక్ పెంచుకోవాలని బీజేపీ కుట్రలు చేస్తోంది.. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో విశాల దృక్పదం తో ముందుకు రావాలి… కాంగ్రెస్ లో అనేక సమస్యలు ఉన్నాయి.. వాటిని సరిదిద్దుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది.. తెలంగాణలో కలుపుకుని పోవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించింది.. చంద్రబాబు బీజేపీకి బయపడుతున్నాడు.. రేవంత్ రెడ్డికున్న దైర్యం చంద్రబాబుకు లేకపోవడం సిగ్గుచేటు.. 17ఏ కు చంద్రబాబు ఉద్యమం చేయాలి తప్ప బయపడీ బీజేపీకి లొంగిపోకూడదు.. అన్న ప్రసన్న చేసే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దానికి ఆవకాయ పచ్చడి తగలించడానికి ప్రయత్నం చేయవద్దు.. రాష్ట్రంలో ఐదు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం.. ఆ ప్రపోజల్ కాంగ్రెస్ ముందు ఉంచాం.. కేటీఆర్ నేనే ముఖ్యమంత్రిననే భావనలో ఉండి మాట్లాడుతున్నారు..’ అని సీపీఐ నారాయణ మండిపడ్డారు.

Show comments