Site icon NTV Telugu

CPI Narayana: అదానీ, మోడీ బంధాన్ని ప్రశ్నిస్తే రెండేళ్ళ శిక్ష

Cpi Narayana On Bjp

Cpi Narayana On Bjp

అదానీ, మోడీ బంధాన్ని ప్రశ్నిస్తే రెండేళ్ళ శిక్ష వేశారని, దేశ వ్యాప్తంగా దేశాన్ని రక్షించండి.. మోదీని ఓడించండి అనే నినాదంతో ముందుకు వెళ్తాం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రకాశం జిల్లాలో ఆయన మోడీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మాత్రం మోదీ, జగన్ హటావో అంటూ కార్యక్రమాలు చేపడతాం..జగన్, మోదీ ఇద్దరు రహస్య బంధం కొనసాగిస్తున్నారు..మణిపూర్ ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు రావాలంటే 2500 ఉన్న టికెట్ ధరలను 25 వేలు చేశారు..ఎయిర్ పోర్టులు ప్రజల సొమ్ముతో కట్టి విమాన సర్వీసులను మాత్రం ప్రైవేట్ వాళ్లకు ఇవ్వటం వల్లే దుస్థితి..దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు..విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటే ఇవ్వమంటున్నారు.. కేవలం ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారట..కేంద్రానికి మద్దతుగా ఉంటే బ్యాంకుల్లో అప్పు తీసుకున్న వేల కోట్ల బాకీలు కూడా రద్దు చేస్తున్నారు.

Read Also: TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబిత

అదానీ కృత్రిమంగా సృష్టించిన ఆర్థిక వ్యవస్థను అమెరికా సంస్థ గుర్తించి బయటకు తెచ్చింది..ప్రధాని మోదీ సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగారు..ప్రభుత్వ రంగ సంస్థల నుండి అదానీకి పెట్టుబడులు పెట్టించారు..మోదీకి 30 మంది దత్త పుత్రులు ఉన్నారు.. వాళ్ళే దేశాన్ని దోచుకుంటున్నారు..బీజేపీని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు..కేరళ ప్రభుత్వాన్ని ఏమి చేయలేక బీజేపీ చొరవతో సినిమా తీయించారు..కర్ణాటకలో గెలుపు కోసం మోదీ మతాల మధ్య చిచుపెడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు..అదానీ, మోదీ బంధాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి అనర్హత వేటు గురయ్యేలా చేశారు..

బూట్లు నాకే చరిత్ర బీజేపీ ది..ఏపీలో అడుగడుగునా సీఎం జగన్ మోదీకి అనుకూలంగా ఉన్నారు..రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా మద్దతు ఇస్తున్నారు..మోదీ, జగన్ ఇద్దరూ కవల పిల్లలు..జగన్ చరిత్ర, దుర్యోధనుడి చరిత్ర ఒకేలా ఉంటాయి..జగన్ కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు ఉన్నారు..రాజన్న పేరు చెప్పి ఆయనకే మూడు నామాలు పెడుతున్న జగన్..బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావు..బంకర్లలో కూర్చుని జగనన్నకు చెప్పండి ఎలా చెప్పగలరు..మీ పరిపాలన అంత సక్కదనంగా ఉంటే నెల్లూరు ఎందుకు అలా అయ్యింది..జిల్లాలో బాలినేని ఎందుకు అలా అయ్యారు..మోదీ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం జగన్ జైలుకు వెళ్తారు.. చంద్రబాబు సందు దొరికితే మోదీతో జత కట్టాలని చూస్తున్నారు..బీజేపీతో సయోధ్యతో ఉన్న పార్టీలతో జతకట్టేది లేదు..మోదీ రాహుల్ గాంధీని చూసి బయపడ బట్టే నిలువ నీడ లేకుండా చేశారని దుయ్యబట్టారు నారాయణ.
Read Also: Abu Dhabi : ఇన్ని సౌకర్యాలుంటాయా.. అక్కడ జాబ్ వస్తే బాగుండు

Exit mobile version