నల్లగొండ జిల్లా మునుగోడులో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. మోడీకి 30మంది దత్త పుత్రులు ఉన్నారు. వారందరూ దేశంలో అప్పులు చేసి పారిపోయారంటూ విమర్శలు గుప్పించారు. మన్ కి బాత్ లో వంద ఎపిసోడ్ లలో వంద అబద్ధాలే మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. దేశ సంపద ఆదానీ, అంబానీలకే దక్కిందని ఆయన అన్నారు. జీఎస్టీ రూపంలో వచ్చిన లక్ష ఎనభై వెయ్యిల కోట్ల రూపాయల ఆదాయం ఎవరికి దోచిపెట్టారని ఆయన ప్రశ్నించారు. పేదవాడు వేసుకునే చెప్పుల పైనా జీఎస్టీ వేస్తుంది మోడీ ప్రభుత్వమని, స్మశానంలో కాల్చే శవం మీద కూడా జీఎస్టీ వేస్తుంది బీజేపీ ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : CM KCR : 1331 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు
ఢిల్లీలో కట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఎవరిని పిలవనక్కర్లేదు అది మీ సొంత పార్టీ కార్యాలయమని, కానీ ప్రజల సొమ్ముతో కట్టిన నూతన సచివాలయనికి ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఆహ్వానం లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మమ్మల్ని వాడుకున్నారని, మా సపోర్ట్ లేకపోతే బీజేపీ గెలిచేదని విశ్లేషకులు చెప్పారన్నారు. మా సపోర్ట్ తోనే బీఆర్ఎస్ పార్టీ మునుగోడులో గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆలోచన రేవు దాటకముందు ఓడ మల్లయ్య…. దాటిన తర్వాత బోడమల్లయ్య లాగా ఉందంటూ ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ తో రాజకీయ పరమైనటువంటి ఎలాంటి కలయిక లేదని, ఇకనుండి దేశంలో బీజేపీపైన రాష్ట్రంలో బీఆర్ఎస్ పైన వారి తప్పులను ఎండగడతామన్నారు.
Also Read : Jabardasth Mahesh: ప్రభాస్ కామెడీ.. చెప్తే చెప్పావ్ కానీ బాసూ.. కడుపు నిండిపోయింది