సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సబకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయం ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అనుకూలంగా ఉండాలి కానీ రాబందులకు అనుకూలంగా ఉండకూడదన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసి, మోడీపై పోరాడుతున్నామన్న సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని, ముందు దేశంలోని బిజెపి వ్యతిరేక శక్తులను సమైక్యపరిచి, కార్యచరనను రూపొందించాలన్నారు. అంతేకాకుండా.. ‘మోడీ గడ్డం ఎంత పెరిగిందో, గ్యాస్ ధర అంతా పెరిగింది, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. బీజేపీ అండతోనే దేశంలో కుబేరులు నల్లదనాన్ని తెల్లదనంగా మార్చుకుంటున్నారు. జీఎస్టీలో కార్పొరేట్ వాళ్లకు పన్నుల తగ్గించి, సామాన్యులు వాడే వస్తువులపై పన్నుల శాతాన్ని పెంచారు.
Also Read : DK Shiva Kumar : డీకే శివ కుమార్ కు ఏఐసీసీ నుంచి పిలుపు
పెండ్లి చేసుకొని భార్యను వదిలేసిన ప్రధాని మోడీకి దేశంలో 30 మంది దత్తపుత్రులున్నారు. రాజ్యాంగ పదవి అయిన ప్రధాని పదవిలో ఉన్న మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో జైబజరంగబలి అనడం సిగ్గుచేటు. పార్లమెంట్ నుండి రాహుల్ గాంధీని అన్యాయంగా తరలిస్తే, కర్ణాటకలో ప్రజలు మోడీని తరలించారు. రేపు చేసి, మానభంగాలు చేసిన వారిని జైలు నుండి విడిపించి సన్మానిస్తున్నారు. అమిత్ షా నంబర్ వన్ ఖూనీ కొరు, క్రిమినల్. గాంధీని చంపిన గాడ్సే నోటి నుండి వచ్చినవాడు మోడీ, మోడీ పాలనలో దేశమంతా ముక్క చెక్కలు అవుతుంది. కేవలం ముగ్గురు మహిళలు కనిపించకుండా కేరళ పైన సినిమా తీయించారు, కానీ 46 వేల మంది గుజరాత్ లో కనబడకుండ పోయారు. పోటీ చేయకుండా ఉండడానికి తామేమి సన్యాసులం కాదు, భూస్వాములకు న్యాయం చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చాడు. మన్ కి బాత్ లో మోడీ వంద అబద్ధాలు ఆడుతున్నాడు, భారతదేశాన్ని కాపాడుకోవాలంటే మోడీ పోవాల్సిందే. నిజాం పాలన కంటే ఘోరంగా ఉంది కేసీఆర్ పాలన’ అని నారాయణ వ్యాఖ్యానించారు.