Site icon NTV Telugu

CPI Ramakrishna: “ఆపరేషన్ సింధూర్” పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపారు..

Cpi Ramakrishna

Cpi Ramakrishna

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ సంస్థలను కార్పొరేట్ రంగాలకు ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటలు, కళారుపాలా శిక్షణా శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్టులను, కమ్యూనిస్టు భావాజాలను అంతం చేయాలని చూస్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా సమస్యలను ప్రజలను గాలికి వదిలేశారని ఆరోపించారు. విదేశాలలో ఉన్న 70 లక్షల కోట్లు ఎన్నికలలో గెలవగానే భారత్ కు తెప్పిస్తానని చెప్పి మాట తప్పారన్నారు.

READ MORE: Nishikant Dubey: కాంగ్రెస్ భారత్ భూభాగాన్ని పాకిస్తాన్‌కి ఇచ్చింది.. ఇందిరా గాంధీపై విమర్శలు..

ప్రజా సమస్యలు తీర్చకుండా ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రామకృష్ణ ఆరోపించారు. పహాల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు చనిపోవడం బాధాకరమన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భయపడి మోడీ యుద్ధాన్ని ఆపేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒక నరహంతక పరిపాలన చేస్తుందని విమర్శించారు. రేపు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం అవుతామని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్‌ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.

READ MORE: Uttam Kumar Reddy : తప్పుడు నిర్మాణంతో కాలేశ్వరం అనర్థ దిశగా.. మంత్రి ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు

Exit mobile version