మాండస్ తుఫాన్ బీభత్సం కలిగించింది. తమిళనాడుతో పాటు ఏపీలోనూ వర్షాలు పంటలకు, ఆస్తులకు నష్టం కలిగించాయి. ఏపీలో తుఫాను నష్టం, రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. మాండస్ తుఫాను సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. పంట చేతికొచ్చిన తరుణంలో మాండస్ తుఫాను వల్ల వేలాది ఎకరాల పంట నీటిపాలై రైతాంగం కుదేలైంది. తీవ్రంగా నష్టాల పాలైన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Read Also: Donkey Gift: గాడిదను గిప్ట్‌గా ఇచ్చిన భర్త.. భార్య ఏం చేసిందంటే..
చాలా ప్రాంతాల్లో కల్లాల్లోని ధాన్యం నీట మునిగింది. అధికార యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని మీరు చెప్పినప్పటికీ, కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉండటం విచారకరం. మా పార్టీ పార్లమెంటరీ నాయకులు, ఎంపీ బినాయ్ విశ్వం కడప కలెక్టరేట్ ను సందర్శించినప్పుడు అధికారులు ఎవరూ లేరు. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వండి. నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించి ఆదుకోవాలన్నారు రామకృష్ణ. ఇదిలా ఉంటే.. తుఫాను, భారీ వర్షాలపై క్యాంపు ఆఫీసులో ఉదయం 11:30గంటలకు సీఎం వైఎస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈసమీక్షా సమావేవానికి సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు.
Read Also: Rickshaw drivers Protest: మరో సారి సమ్మెకు సై అంటున్న ఆటో వాలాలు
