NTV Telugu Site icon

Chada Venkat Reddy: అంబేద్కర్ రాసిన రాజ్యాగం రాష్ట్రంలో అమలు కావడం లేదు..

Chada Venkat Reddy

Chada Venkat Reddy

Chada Venkat Reddy: బీజేపీ హఠావో-దేశ్ కీ బచావో అనే నినాదంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య యాత్ర నిర్వహిస్తోంది. చేర్యాల, కొమురవెళ్లి మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజా చైతన్యయాత్రలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాగం రాష్ట్రంలో అమలుకావడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అమలు చేయడం లేదని ఆరోపించారు.

Read Also: Errabelli Dayakar Rao: ఆ ఘనత కేసీఆర్, కేటీఆర్‌లకే దక్కుతుంది..

దేశంలోనే సంపన్నుడైన అదానీ 3లక్షల వేల కోట్లు బ్యాంక్‌లకు బకాయి ఉన్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని, ఎందుకంటే ఇద్దరు గుజరాతీలేనని చాడ ఆరోపణలు చేశారు. కేంద్రం బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలపై భారం మోపుతోందని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి బీజేపీ మతోన్మాద రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు.