Site icon NTV Telugu

Ramakrishna: విశాఖ నుంచి పాలన కోర్టు ధిక్కరణే..!

Cpi Ramakrishna

Cpi Ramakrishna

Ramakrishna: త్వరలోనే విశాఖపట్నం నుంచి పాలన ప్రారంభించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సిద్ధం అవుతుంది.. డిసెంబర్‌ 8వ తేదీ మూహూర్తం కూడా ఫిక్స్‌ చేసినట్టు ప్రచారం సాగుతోంది.. అయితే, సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తానంటున్నారు.. విశాఖ నుంచి పరిపాలిస్తాననడం కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఋషికొండపై నిర్మాణంలో 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు.

Read Also: Telangana Elections 2023: బోధన్ లో పోస్టర్ల కలకలం.. సంచలనం సృష్టిస్తున్న ఫోటోలు

ఇక, 2014 నుంచి ఇవాళ్టి వరకూ జరిగిన మద్యం అమ్మకాలపై విచారణ జరగాలన్నారు రామకృష్ణ.. ఓటర్ల చేర్పు లోనే దొంగ ఓట్లు ఉన్నాయి.. దొంగ ఓట్ల పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం అన్నారు. గవర్నర్ పాత్రపైన కూడా అనుమానాలున్నాయన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున కొనసాగుతోంది.. ఉచిత ఇసుకతో అన్యాయం జరిగిందని చంద్రబాబుపై కేసు పెట్టారని.. ఇంకా వెళ్లిపోయిన జేపీ ఇన్ఫ్రా పేరుతోనే బిల్లులు ఇస్తున్నారని మండిపడ్డారు. డ్యామ్‌లలో నీళ్లు లేవు.. వర్షాలు కురవడం లేదు.. మద్యం దోపిడీ కింద మొత్తం సొమ్మంతా దోచుకుంటున్నారని ఆరోపించారు. కొల్లు రవీంద్ర, చంద్రబాబు పైన కేసులు పెడుతున్నారు.. దొంగల రాజ్యం ఈ రాష్ట్రంలో నడుస్తోందని విమర్శించారు.. మద్యంలో చంద్రబాబు అవినీతి ఉంటే విచారణ చేయాలని సూచించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

Exit mobile version