బీఆర్ఎస్ తో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా దూషించబోమని.. విధాన పరంగా వ్యతిరేకిస్తామని సీపీఐ, సీపీఎం నేతలు అన్నారు. అయితే, హైదరాబాద్ లో సీపీఐ, సీపీఎం నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఇరు పార్టీలకు చెందిన నాయకులు చర్చించారు. ఈ మీటింగ్ లో సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, జాన్ వెస్లీ, చెరుపల్లి సీతారాములుతో పాటు సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, తక్కలపల్లి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Also: Sachin Tendulkar: నేషనల్ ఐకాన్గా క్రికెట్ లెజెండ్.. రేపు ఈసీతో ఒప్పందం
ఈ మీటింగ్ ముగిసిన తర్వాత కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. కూనంనేని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో మాకేం నష్టం లేదు.. నష్టపోయేది కేసీఆరే.. బీజేపీతో కేసీఆర్‌కి సఖ్యత వచ్చింది.. మునుగోడులో బీజేపీ ప్రమాదమని చెప్పిన కేసీఆర్‌కి.. ఇప్పుడు బీజేపీతో మిత్రుత్వం ఎక్కడ కుదిరింది? బీజేపీకి దగ్గరైతే.. కనీస మిత్ర ధర్మం ఉండాలి కదా? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి అని అడిగారు. ప్రస్తుతం రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనం ఇస్తున్నారని ఆయన కామెంట్స్ చేస్తున్నారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ ఏమయ్యేది అని కూనంనేని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల్లో కేసీఆరే మా అండ కోరారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కూడా వామపక్షాలు మిత్రపక్షాలని కేసీఆర్ చెప్పారు అని ఆయన గుర్తు చేశారు.
Read Also: Kantara 2 : షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కేసీఆర్ ఏకపక్షంగా అభ్యర్థుల జాబితా ఇచ్చారు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మేం అడిగిన సీట్లలో కూడా అభ్యర్థులను ప్రకటించారు.. మేం ఇది ఊహించని పరిణామం.. మునుగోడులో ఆయనే మద్దతు అడిగారు.. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పని చేస్తామని చెప్పారని తమ్మినేని తెలిపారు. మాకు.. కేసీఆర్‌కి మధ్య సీట్ల పంచాయతీ సమస్య కాదు.. కేసీఆర్‌కి రాజకీయ విధానంతో సమస్య వచ్చింది.. రాజకీయ విభేదం ఏంటన్న వివరణ కేసీఆర్ ఇవ్వాలి.. మా ఇంటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో.. వాళ్ల ఇల్లు మాకు అంతే దూరం.. వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు కలిసి పని చేస్తాయని తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి.. మా నినాదం బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే అని కమ్యూనిస్టులు అన్నారు.
