NTV Telugu Site icon

CP Vishwaprasad : డ్రంకెన్ డ్రైవింగ్‌తో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తాం

Drunk And Drive

Drunk And Drive

కొత్త సంవత్సరం సంబరాలు సంతోషంగా జరుపుకోవాలని, వాహన దారులు నిబంధనలు ఉల్లంఘిస్తే..కటిన చర్యలు తప్పవన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్. డ్రంకెన్ డ్రైవింగ్ తో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ..ప్రాణాలు తీసుకోవద్దని సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. పోలీస్ ల శిక్షల కంటే.. వాహన దారుల్లో మార్పులు రావాలన్నారు. బార్ లు , పబ్బుల వద్ద సరిఅయిన పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, ఎన్టీ ఆర్ ఘాట్ , నక్లేస్ రోడ్ లలో..బైక్ లపై ఫీట్ లు చేస్తూ.. అమ్మాయిలను వేధించే వారి పట్ల మాకు వ్యూహం వుందన్నారు. వారి వీడియో లు రికార్డ్ చేసి..తరువాత అరెస్ట్ చేస్తామన్నారు. ఫ్లైఓవర్ లు మూసి వేస్తాము..వాహన దారులు సహకరించాలన్నారు. కొత్త సంవత్సరం లో తెల్ల వారే వరకు మేము తనిఖీలు చేస్తామన్నారు.

 

డిసెంబర్ 31 ఆదివారం రాత్రి 10.00 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు పెద్ద ఎత్తున చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్, మైత్రివనం బోరబండ డివిజన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రంక్‌ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం, వాహనాల పై భాగంలో ప్రయాణించడం, బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితి మీరిన శబ్దాలు, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, వాహనాలపై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా, బాధ్యతగా సురక్షితంగా వాహనాలు నడిపి నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు కోరారు.